Abhinandana Songs | Rangulalo Kalavo | Karthik, Sobhana | Melody Song | TeluguOne

preview_player
Показать описание
Watch Karthik Sobhana's Abhinandana Telugu Movie Song With HD Quality
Music - Ilayaraja
Lyricist - Aatreya
Рекомендации по теме
Комментарии
Автор

ఆయన గొంతు చివరి వరకు అలానే ఉంది, ఈ కరోనా లేకపోతే 100 సంవత్సరాలు వచ్చినా ఇంతే అందంగా పాటలు పాడుతూ ఉండేవారు.

greatsri
Автор

ఇలాంటి పాటలు పాడిన బాలూ గారు... మన మనసులోని రంగులలో కల అయిపోయారు. మిమ్మల్ని ఎన్ని జన్మలకు కూడా మరచి పోము

prathizna
Автор

గంధర్వ గానం... వింటే ధ్యానం.. మౌనం.. సంగీతాన్ని మించిన మందు ఏముంది..

raampraas
Автор

ఈ పాట వింటు ఉంటే జీవితంలో మరణమనేదే లేకుంటే బావుండు అని అనిపిస్తూ ఉంటుంది..జీవితాంతం ఇలాంటి ఈ పాటలు వింటూనే ఉండాలనిపిస్తుంది.చాలా చాలా అద్భుతమైన, సాహిత్యం, అలాగే కాశ్మీర నందన సుందరి లాంటి శోభన గారి అద్భుత అభినయం ఉన్న . తెలుగు సంగీత స్వర రాజు ఇళయరాజా గారి ఆత్యద్బుత సంగీతం ఉన్న ఇలాంటి పాటలు వినాలి, వింటూనే ఉండాలి, అప్పుడే జీవితం ధన్యం అనిపిస్తుంది.రోజుకి ఒక్కసారి విన్న మనసు ఆనందమయం అవడం జరుగుతుంది., అలాగే సంగీత గురువర్యులు గారికి శతకోటి వందనాలు.

chanduchalluri
Автор

ఆత్రేయగారి సాహిత్యం, ఇళయరాజా గారి సంగీతం, sp బాలుగారి

yatishreyya
Автор

అబ్బా.. ఏం పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరదు. బాలు&జానకమ్మ మీ గొంతు కోయిలను మరపింప జేస్తుంది.
థాంక్స్ ఇళయరాజా గారు.మీ మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్.

sureshshanigarapu
Автор

ఈరోజు 30 వ తారీకు జూన్ నెల 2024 ఈరోజు కూడా ఈ పాట వింటుంటే మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఇంత అందంగా రాసిన రచయితకి, అందంగా పాడిన గాయకుడికి, అందమైన సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడికి నా పాదాభివందనం🙏🏽

KumarVijay-nqcw
Автор

ఇలాంటి పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెలుతుంది ఎంత బాధ ఉన్న కరిగిపోతుంది

vishnuvardhanreddy
Автор

ఇళయరాజా లాంటి గొప్ప సంగీతదర్శకుడుకి S.జానకమ్మ S.P.బాలసుబ్రహ్మణ్యం లాంటి గ్రేట్ సింగర్స్ కలిసి పని చేస్తే ఇలాంటి ఆణిముత్యలాంటి పాటలే వస్తాయి మరీ

sakeravi
Автор

కాల్చే కొద్దీ బంగారానికి వన్నె పెరిగినట్టు ఈ పాటకి ఎప్పటికీ వన్నె తగ్గదు

shivakumar
Автор

ఈ పాట వింటు ఉంటే జన్మ ధన్యం అనుకునేవారు, ఒక like ఇవ్వండి.నాకు మాత్రం చాలా I love u

chanduchalluri
Автор

జానకమ్మ గారి స్వరం అధ్బుతం అత్యత్భుతం.

Renachow
Автор

ఇళయరాజా సంగీతం నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి..👏👏👌👌👌👌👍👍👍

krishhkrishh
Автор

**** Telugu Lyrics ****
రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో (2)
నవ శిల్పానివో.. రతి రూపానివో
తొలి ఊహల ఊయలవో !!
రంగులలో కలవో.. ఎదపొంగులలో కళవో

*కాశ్మీర నందన సుందరివో (2)
కైలాస మందిర లాస్యానివో
ఆమని పూచే యామినివో (2)
మరుని బాణమో.. మధుమాస గానమో
నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై
నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై
నీ ఊహల ఊగించనా !!
రంగులలో కలనై..

*ముంతాజ్ అందాల అద్దానివో (2)
షాజహాన్ అనురాగ సౌధానివో
లైలా కన్నుల ప్రేయసివో (2)
ప్రణయ దీపమో.. నా విరహ తాపమో
నా చిత్రకళల చిత్ర చైత్ర రథమో

రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై
నవ శిల్పాంగినై.. రతి రూపాంగినై
నీ ఊహల ఊగించనా !!
రంగులలో కలనై.. ఎదపొంగులలో కళనై

SpirichualKreatures
Автор

అభినందన సినిమా పాటలు సెర్చ్ చేసి మరి చూస్తున్న వారు ప్రేమలో.... ప్రేమతో.... ప్రేమించే... వారు ప్రేమ విఫలం... అయినా వారు 🙏

Sagar-a
Автор

నాకూ ఇప్పుడు 42 ఇయర్స్.. చిన్నప్పుడు ఈ picture ని మా అమ్మ గారు నన్ను చూడనివ్వలేదు. అప్పట్లో అలా ఉండేవి ప్రేమ పట్ల పెద్దవాళ్ళ భావాలు. ఇప్పుడు అన్నీ ప్రేమలని అందరు అంగీకరిస్తున్నారు. ఈ సాంగ్ వింటుంటే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుందండి ఎప్పుడు విన్నా.. మంచి song

sumamani
Автор

రంగులలో కలవో అద్భుతం పాట కి ప్రాణం పోసిన ఇళయరాజా గారికి 🙏🙏

manikayamgoud
Автор

పి.రమణ మూర్తి గారు నిర్మాతగా అశోక్ కుమార్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన ప్రేమ గీతానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రమణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు కార్తీక్ గారి నటి శోభన గారి అభినయం వర్ణనాతీతం.

hemanth
Автор

2021 lo e pata vinna vallu like vesukondi

rajirajeshwari
Автор

సంగీత మాంత్రికుడు ఇళయరాజా అద్భుతమైన స్వరకల్పన, ఇళయరాజా కు దాసుడు కాని సంగీత అభిమాని ఉంటాడా?

batchaliramu