Melodious ooyala song dedicated to Goddess Lalitha

preview_player
Показать описание
Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
ABOUT THIS VIDEO:
This is a video containing a song in a very melodious, soothing voice by Mannava Revathi. Lyrics are by VVL Narasimham.
Please go through this video in full and derive the full advantages from it.
Please like the video, share it with your relatives and friends, offer your valuable comments and finally subscribe to my channel and press the Bell Button by the side. This will encourage me in making more and more such videos and you will get notifications about my future videos.
Thank You.
#vvl_narasimham #navarathri #ooyala_song

Рекомендации по теме
Комментарии
Автор

🙏🙏తల్లి మాతృ దేవత అమ్మ లాలీ పాట ఎంత చక్కగా పాడి మమ్ము అమ్మలోకంలోకి తీసుకు వెళ్లవు తల్లి, మేము విని ఆనందించి తరించు తున్నాము తల్లి 🙏🙏 నీ గొప్ప భావాల పరంపరలకు ప్రణామాలు సమర్పిస్తున్నాను తల్లి 🙏

gaddamvarusuraiah
Автор

లాలి ముద్దుల గుమ్మ లాలి మాయమ్మా.
లాలి బంగరు బొమ్మ లాలి లలితమ్మా.//2//
లాలి జో..లాలి జో..లాలీ..//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
దేవతల కష్టములు తీర్చగావించి అగ్ని కుండము నుంచి ఉద్భవించితివి//2//
దయలోన నీకెవరూ సాటి రారమ్మా అమ్మలనుగన్న మా తల్లి లలితమ్మా//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
కామేశ్వరునికే ప్రణయదేవతగా నా తండ్రిలో నీవు సగమైనావూ//2//
లోకాలన్నింటినీ కాపాడదలచి గరళ కంఠునిగా నీ పతిని నిలిపావు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
విఘ్ననాయకుడే పుత్రుడై వెలయ..శ్రీ షణ్ముఖునకు కన్న తల్లివిగా//2//
ఇద్దరీ తనయులని మదినించకమ్మా ..నీ ముద్దుమురిపాలు మాకూ పంచమ్మా//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
సర్వయంత్రములు, సర్వతంత్రములు నీ రూపమే కదా జగన్మాత//2//
శ్రీ యంత్రమే కదా నీ నివాసమ్ము, చింతామణీగృహము నీకు నిలయమ్ము//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
గాయత్రి నీవే, సావిత్రీ నీవే, శర్వాణి నీవే శైలేంద్ర తనయా//2//
జ్ఞాన శక్తి, క్రియా శక్తి రూపమై సర్వులనూ చల్లగా చూడు మా జననీ//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
యోగ మాయవు నీవు, నీకు నిదురేల, నీ యోగ నిద్రలో శయనించు లోకాలు//2//
అండాండ, పిండాండ, బ్రహ్మాండములో నిదురించు వేళాయే, శయనించవమ్మా//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలనుచు పాడరే స్పటికమణిమయికి లాలనుచు పాడరే కృష్ణ పింగళకు//2//
లాలనుచు పాడరే హ్రీంకార రూపిణికీ, లాలనుచు పాడరే సర్వమంగళకు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//
లాలి ముద్దుల
లాలి బంగరు//2//
లాలి జో..లాలి జో..లాలీ//2//

శ్రీ మాత్రేనమః.
తప్పులుంటే మన్నించండి.

dr.madhurij
Автор

అమ్మ గణిత అమ్మ నీ జోల పాట విని చాలా ఆనందంగా ఉంది తల్లి నీ జోల పాట పాడినందుకు

nirmalamuddu
Автор

ఈ పాట చాలాబాగుంది లిరిక్స్ కూడా పెట్టినందుకు. చాలా సంతోషం

SitaDevi-tjbz
Автор

శ్రీ మాత్రే నమః ఎంత బాగా రాశారు అండి...అమ్మకి లలి పాడే అదృష్టం దక్కించుకున్న ఈ గాయని జీవితం ధన్యం...alege మీ లిరిక్స్ అథ్భుతం...మనస్సు ఆనడ డోలికల్లో ఊగిపోతోంది పాట వింటున్నంతసేపు...నాకు మాటలు చాలడం లేదు...నేను అందరికి పాట share చేస్తున్నాను..నేను కూడా నేర్చుకొని అమ్మకి లాలి పాడి స్వర అర్చన చేసుకుంటాను.. ధన్యవాదాలు మీకు..

ashalatha
Автор

చాలా బాగుంది తల్లి పాట, నువ్వు పాడిన విధానం.ధన్యవాదములు

padmatadepalli
Автор

Me Rachana adbhuthanga vundandi
Me ammayi chaala baaga paadaaru
Nenu me paata nerchukuni paadthanu
Bless me sir🙏🙏
Ilanti marenno paatalu mee nunchi korukuntunnamu sir🙏🙏

anuradhaswaralu
Автор

నమస్కారమండి. లలితా అమ్మవారికోసం పాడిన లాలిపాట ఎంతో లాలిత్యంగా మధురంగావుంది. పాడినవారికి శుభాకాంక్షలు. నమస్కారమండి.

swarnalathasanka
Автор

అమ్మవారి లాలి పాట చాలా చాలా బావుందండి. లిరిక్స్, రేవతి గారి గొంతు అద్భుతంగా ఉంది. అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబానికి సంపూర్ణంగా ఉంది 🙏

sasirekhamachiraju
Автор

Chalaa baga padaru ma'am roju e pata vaetu Nidia pothanu ❤

srinivasaraoachyuyha
Автор

పాట చాల బాగుంది మాకు లిరిక్ కావాలండి ప్లీజ్

shobharanijm
Автор

ఎంత హాయిగా ఉందో ఈలాలిపాట.శ్రీ మాత్రేనమః..శ్రీ మాట కటాక్ష సిద్దిరస్తు.

sowjanyachaturvedula
Автор

చాలా చాలా బాగుందండి పాట, స్వరం, భావం 🙏🏻🙏🏻

satyaprasad
Автор

రేవతి గారు అమ్మ లలితమ్మ లాలిపాట ఏంతో మాధుర్యంగా పాడారు. మీకు చాలాచాలా ధన్యవాదాలు

lakshmimukkamala
Автор

Excellent sahityam and singing. Lalithamme yeduruga unnatlu anipisthundi

sankararaokurmapu
Автор

Revatio gariki thankyou andi. Manchi Lalipata pettinanduku. Excellent ga vunnadi.

rajakumarigelli
Автор

మా అమ్మ నా చిన్నప్పుడు ఇలానే రోజూ లాలి పాటలు పాడుతూ ఉంటే ఎంత హాయిగా ఎంజాయ్ చేసేవాడిని. చాలా బాగా నచ్చింది నాకు 🙏🙏🙏🙏👌👌👌

vvvhsharma
Автор

Chala melodious ga padaru andi, lirics pettinanduku thank you so much andi

yatra-visheshalu
Автор

లలతాదేవి లాలి పటకి ఎంతో వినసొంపుగా, ప్రశాంతంగా పాడిన బంగారు తల్లికి అనేక అనేక అభివాదములు..

gouninarender
Автор

Excellent song ఏదో లోకంలో కి వెళ్లి పోయాము Tq very much

nagaratnakumarisure