Devude ichadu Veedhi Okati Video Song HD - Anthuleni Katha Movie Song | Rajinikanth

preview_player
Показать описание
Anthuleni Katha Movie
Starring Jayaprada, Rajinikanth, Sripriya and Phataphat Jayalaxmi, Directed by K. Balachander,
Produced by Rama Arannangal,
Music by M.S.Viswanathan

Рекомендации по теме
Комментарии
Автор

అంతలేనికథ సినిమా మొదట, తమిళంలో తరువాత తెలుగులో తీశారు.రెండు భాషల్లో ఒకే రాగంతో వచ్చిన పాటలు.గాయకులు ఒకరే, సంగీత దరర్శకులు ఒకరే.పాట రచయిత లు మాత్రం ఇద్దరు.తెలుగు లో మన మనసు కవి ఆత్రేయ గారు, పాటలలో అద్భుతాలు సృష్టిస్తే, తమిళంలో, తమిళ మనసుకవి, అనబడే Kannadasan గారు, అంతే అద్భుతంగా పాటలను మలచారు.రెండు భాషలలో రికార్డు సృష్టించారు..నాటీ నటులలో కొంత మార్పుతో, మాంచి కథాంశంతో సినిమా నుఅలరించారు.ప్రతి పాట గానామృతమే.ఇంతటి మహానుభావులకు, నా హృదయ పూర్వక ప్రణామములు..

rabbybandila
Автор

దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి..
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
ఇక ఊరేల సొంత ఇల్లేల
ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

నన్నడిగి తలిదండ్రి కన్నారా..
నన్నడిగి తలిదండ్రి కన్నారా
నా పిల్లలే నన్నడిగి పుట్టారా
పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా
నారు పోసి నీరు పోసే నాధుడు వాడమ్మా
ఏది నీది ఏది నాది
ఈ వేదాలు ఉత్త వాదాలే ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

శిలలేని గుడికేల నైవేద్యం
ఈ కలలోని సిరికేల నీ సంబరం
ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచే ఎందుకు చిట్టమ్మా
కళ్ళులేని కభోధి చేతి దీపం నీవమ్మా
తొలుత ఇల్లు తుదకు మన్ను
ఈ బ్రతుకెంత దాని విలువెంత
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం
అది తెలియకపోతేనే వేదాంతం
మన్నులోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా
నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా
ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి అహంకారం ఓ చెల్లెలా
ఏల ఈ స్వార్ధం ఏది పరమార్ధం
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి
దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి

jaswanthreddy
Автор

మన్ను లోన మాణిక్యాన్ని వెతికే వెర్రెమ్మా ! నిన్ను నువ్వు తెలుసుకుంటే చాలును పోవమ్మా !
ఆచార్య ఆత్రేయ జీ ది గ్రేట్.

prasadsatya
Автор

తెలిసేట్లు చెప్పేది సిద్ధాంతం తెలియకపోతేనే వేదాంతం 👌👌👌 ఎలా ఇంత బాగా చెప్పారు ఏది ఏమైనా ఆ మనుషులు వేరు వారి కళాఖండాలు వేరు వారి పాటలు మాటలు అజరామరం ప్రజల హృదయాలలో తరాలు పాటు సుస్థిరమైన స్థానం ఉంటుంది ❤❤❤

stockmarket
Автор

అప్పట్లో ఒక పాట వింటే జీవితం అంటే ఎంతో అర్థం అయ్యేది ఇప్పుడు సినిమా మొత్తం చూసిన సినిమా నే అర్ధం కావటం లేదు. అది నేటి పరిస్థితి

demudubabunimiditalli
Автор

ఈ పాటలోని భావం, మధురమైన యేసుదాసు గారి గాత్రం, సంగీతం, సాహిత్యం మరియు రజనీ కాంత్ గారి హావభావాలు మహా అద్భుతం.

brahmanaiduyakkati
Автор

అద్భుతమైన వాయిస్ జేసుదాస్ గారిది. పాటకే అందం తెచ్చిన గొంతు. అద్భుతం.

యామినీకిరణ్
Автор

సూపర్ . నారు పోసి / నీరు పోసే నాధుడు వాడమ్మా

prasadyelamarthi
Автор

పాత్రలో. సోంబేరి అయినా. పాటలో. అక్షర సత్యం చెప్పేవిధానం. చాలా గొప్ప విషయం. ఎంత అద్భుతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అన్ని కలిపి. తే. వచ్చిందే. ఈ. పవిత్ర. పధం

kondaiahmaddu
Автор

2023 లో అయిన 2060 అయిన ఈ పాట చెక్కు చెరగని గానం

santhoshkumar-prhs
Автор

పాపంపుణ్యం నాది కాదు పోవే చిట్టెమ్మా నారు పోసి నీరుపోసే దేవుడు వాడమ్మా

baalubaalu
Автор

ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి ఆహంకారం ఓ చెల్లెలా నన్ను అడిగి తల్లిదండ్రి కన్నారా.. నా పిల్లలే నన్నుడిగి పుట్టరా..

shekarssdigital
Автор

ఇ సాంగ్ 2022 లో విన్న వారు ఎంత మంది ఉన్నారో like చేయండి

vallepubalaji
Автор

ఒక్కొక్క word ఒక్కొక్క గోల్డ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Naresh-gsdq
Автор

ఈ చిత్రం అవళ్ ఒరు తొడర్ కధై తమిళ చిత్రానికి తెలుగు సేత
రచన: ఆత్రేయ (కవి కణ్ణదాసన్ పాటకు తెలుగు స్వేచ్ఛానువాదం)
అపూర్వమైన రచన, జీవిత సత్యాన్ని మరువలేని రీతిగా, వడబోసి చెప్పిన గానం.

subramanyambathala
Автор

రోజుకి ఒక్కసారి అయినా వింటాను 2024 స్టిల్ వాచింగ్ 🙏🏻🙏🏻🙏🏻 జేసుదాస్ 🙏🏻🙏🏻🙏🏻

karnavictory
Автор

ఈ సాంగ్ 2023 లో వినేవారు ఎంత మంది ఉన్నారు 🥺

ranibaby
Автор

ఏది సత్యం ఏది నిత్యం
ఈ మమకారం ఒట్టి ఆహంకారం ఓ చెల్లెలా 👌👌👌

s.obulesusomanapalli
Автор

Malli malli vinaali anipinche paata...even though old song but still it is golden song. Gatha kodhi kaalam ga malli malli vintunaanu 2024...feel good song.

venkatanellore
Автор

🙏🙏🙏🌹🌹💐💐 ఇలా పాట మాధుర్యం వింటుంటే మనసు చలించి పోతుంది కన్నీళ్లు వచ్చాయి 🙏

madhumohanchakali