Nuvvo Raayi Neno Shilpi Latest Telugu Motivational Song 2021|#CharanArjun|Bvm Creations

preview_player
Показать описание
///All Copy Rights Reserved///

-------------------:BVM Team Works Presents:------------



BVM Production team: Subbu,Giri,Jaya,Sai,

BVM Creations
&
in Association With G M C Telivision

Concept-Direction : #Suresh Surya

Cinematographer : #Vinee Choppari

Lyirics-Singer-Music : #Charan Arjun

CAST : #BVM Siva Shankar

Ast-Cinematographer:U.S vijay

Music Production Manager: Malya Kandukuri

Recorded,Mixed & Mastered At G Miracles crew By Mahie

నువ్వో రాయి.. 🕳
నేనొ శిల్పి... 🔨
చెక్కుతున్నంతసేపు...
నిన్ను నేను చెక్కుతున్నంతసేపు........
ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని....... 🙏
నేనో అంటారానివాడిని..... 😓
కానీ నిన్నుతాకే భాగ్యం లేదా...? 👈
నేనెం పాపం జెస్తినీ......

Nuvvo Raayi Neno Shilpi Latest Full Song 2019:BVM TeamWorks|CharanArjun|BvmSivaShankar|Bvm Creations


Click here to watch: Inspirational and Motivational Speeches
Рекомендации по теме
Комментарии
Автор

2025 లో కూడా ఈ పాట వింటున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా?

USDreams
Автор

ఉణ్ణోఢు లేణ్ణోఢు అంటూ తేడాలు చూపి నువ్ కూడా మనిషి య్ఇపొథివీ చాల మంచి పాట నా జన్మ ధన్యం అయ్యింది

ramakrishna-vwqv
Автор

ఉన్నొడు లెనోడని తేడాలు చూపి నువ్కుడా మనిషై పోతివి
Wttt ah lyrics
Very very heart touching voice
God bless u people

karthikc
Автор

ప్రాణం లేని రాళ్లకు ఉన్న విలువ
ప్రాణం ఉన్న పేదవాళ్ళకీ లేదు
నా భారత దేశం లో 🙏

BaluAnnabattula
Автор

దేవునికి లేని కులము మనుషులకు ఎందుకు... కులము మతము అని కొట్టుకు చస్తున్నారు.. ఈ సమాజం కుల రహిత దేశంగా ఎపుడు మారుతుందో...పాట చాలా అద్భుతంగా పాడారు..👏👏👏🙏🙏🙏🙏🙏

rajeswaribandapalli
Автор

ఉన్నోడు లెనోడంటు తేడాలు చుపి నువ్వు కూడ మనిషివి ఐతివి.

Super lyrics 👏👏👏

saifulraheman
Автор

ఇంతమంచి పాటకి ప్రాణం పోసి, రాసిన కవికి, పాడిన గాయకుడికి, వెలుగులోకి తీసుకువచ్చిన ఖన్నా అండ్ కేసవి కి వందనం...🙏

chantisingam
Автор

ఈ పాట రాసిన మహానుభావుడికి, పాడిన వారికి, నటించిన వారికి, కాళ్ళు పట్టుకొని నమస్కారం చేసుకోవాలి అని ఉంది, సబ్బండ వర్ణాలు మేల్కోవాలి

iascult
Автор

కులం అని కొట్టుకునే వాళ్లకు మంచి
గుణపాఠం చెప్పావు.నువ్వు సూపర్ ..BOSS

diaplusclinicbengaluru
Автор

సూటిగా గుండెల్ని తాకి ఆలోచింపజేసే పాట రాశారు ..ఎంత పొగిడినా తక్కువే 👏👏👏

Asif_Shaik_
Автор

ఈ పాటకి లక్ష లైక్స్ కొట్టే అవకాశాన్ని నాకు ప్రసాదించండి, ఎందుకంటే
మనిషిని, మనసుని కదిలించే శక్తి సంగీత సాహిత్యానికి ఉంటుందనడానికి నిలువెత్తు నిదర్షనం ఈ పాట...

Trancemeher
Автор

(హరి హరా, హా ఆ ఆ)
నువ్వో రాయి నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాత అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నువ్వో రాయి… నేనో శిల్పీ
చెక్కుతున్నంత సేపూ
నిన్ను నేనూ చెక్కుతున్నంత సేపూ
ఆ తరువాతా అంటారంతా
నిన్ను దేవుడనీ
నేనో అంటరానివాడిని

నీ గర్భగుడినే కట్టేటపుడు
నేను పెద్ద మేస్త్రి
అది పూర్తయ్యాక లోనకొస్తావుంటే
నన్ను బయటికి తోస్తివి

నిన్ను మేలు కొలుపగ
డోలు సన్నాయి… నేనే వాయిస్తిని
కాని నిన్ను తాకే భాగ్యం లేదా
నేనేం పాపం చేస్తినీ

(అయ్యో, దేవా)
నువ్వు నడిచేప్పుడు
నీ పాదాలు కందకుండా
చేసాను నీకు చెప్పులు
నా పాదాలనే నీ గుళ్లోన మోపనీవు
ఏంటయ్యా నా తప్పులు

సింగారించా నీకు బంగారు వస్త్రాలెన్నో
నేసాయి నా చేతులు
కానీ నిను చూడ రావాలంటే
నాకో జత బట్టల్లేవు
ఏంటయ్యా మా రాతలు

నీ మాసిన బట్టలే
మా ప్రసాదామని
నేను శుభ్రం చేస్తిని
కానీ మలిన పడిన వాడివంటూ
దూరంగా ఉండాలంటివి

నీ ముందు వెలిగే దీపంటలు
నా చెమటతో చేస్తినీ
కానీ ఎందుకో మా మట్టి బ్రతుకున
ఏ దీపం పెట్టవైతివి

(ఏ ఏ ఏ ఏ)
నోరే లేని మూగజీవాలను గాయమని
గోసీ ఓ గొంగడి ఇస్తివి
ఇప్పుడు వాటికి మాకు ఏ తేడాలే
లేవన్నట్లు సులకనగా వెనకబడేస్తివి

తల్లీ పాల వంటి… తాటి కల్లు గీసే
నా గోసలు చూడవైతివి
వందడుగుల చెట్టే ఎక్కే నా కాళ్ళకు
నిన్నే మోసే భాగ్యాన్నే ఇవ్వవైతివి

నీ పల్లకీ చేసిన చేతులకు
పాచిక పుల్లయిన ఇవ్వకపోతివి
ఊళ్ళో అందరికీ నేనే క్షవరాలు చేస్తే
నా బ్రతుకే క్షవరం చేస్తివి

మా పుట్టుక బట్టీ… చేసే పని బట్టీ
ఏవేవో పేర్లు పెడితో
కానీ ఉన్నోడు లేనోడంటూ
తేడాలు చూపి నువ్ కూడా
మనిషై పోతివి

VEENAREDDY-mc
Автор

దయచేసి మీరు ఇలాంటి చక్కటి / తీయని పదాలతో చాలా ఆల్బమ్స్ చే యాలని కొరుతున్నాను, మనిషి మనసు ల ఆలోచనలు మార్పు రావటం కొంతవరకు సాధ్యమవుతుంది అని నా అభిప్రాయం and మీకు నా ధన్యవాదాలు...

Dimension-mind
Автор

Comments పెట్టాలంటే కూడా మాటలు రావడం లేదు అంతా బాగుంది సాంగ్, ,🙏🙏🙏🙏👏👏👏👋

rajudharavath
Автор

ఈ పాట రాసిన వారికి అభినందనలు. అర్థం చేసుకునే వారికి ప్రతి ఒక line గుండెల్ని పిండేసేలా ఉంది,
Hats off, 👏👏👏👏

vinodgunduka
Автор

ఈ నీచ సంసృతి ని మార్చడానికి దేవుడు నీరూపములో ఈ పాట రూపం లో వచ్చాడు అనుకుంటున్నా బ్రదర్ ఈ నీచ సమాజం మారేంతవరకు మీరు ఇలాంటి వీడియోలు చెయ్యాలని ఆ దేవుణ్ణి నిన్ను మనసుపూర్తిగా కోరుకుంటున్న.

thirusocialpostforthepeopl
Автор

Wow wonderful అర్ధవంతమైన పాట బ్రధర్ . రాయికి ఉన్న విలువ మనిషికి లేదు మన దేశంలో. 😭😭🙏🙏

naniaddanki
Автор

ఈ సాంగ్ కి కోట్ల వందనాలు .ఎన్ని సంవత్సరాలు అయిన ఈ సాంగ్ చిరస్థాయిగా నిలిచిపోతుంది.hats off brother .

kranthikumar
Автор

మిత్రమా నీకేమి ఇవ్వగలను నేను
రాసిన కలానికి, కదిలించిన రాగానికి నేనేమిఇవ్వగలను
కదిలించే దృశ్యాలను చితరించిన కెమెరాకి, అద్భుత నటనకి నేనేమిఇవ్వగలను
చెయ్యెత్తి జైకొడతాను ప్రపంచం చూడాలని ... ఇదొక అద్భుత కళాఖండం

infraengineersbuilders
Автор

చరణ్ అర్జున్ అన్న మీరు రాసి పాడిన ఈ పాటలో ప్రతి ఒక్క చరణం సమాజాన్ని మేల్కొలిపేలా ఉంది. మీ పాటతో మీకు నేను వీరాభిమానిని అయ్యానని చెప్పుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నాను.... మీ కలం నుండి ఎన్నో, ఎన్నెన్నో సమాజాన్ని మార్చే మాటలు పాటల రూపంలో మా ముందుకు రావాలని కోరుకుంటూ.... ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలని వేడుకుంటూ.... మిమ్మల్ని అభిమానించే... మీ తమ్ముడు.

ravalasamark