Aadivaram Angadi Full Song | Icon Rk | Maliya | Singer Srinidi | Dilip | Kalyan Keys | Icon Tunes

preview_player
Показать описание
Presenting the vibrant and energetic folk song ‘Aadhivaaram Angadi’ sung by Srinidhi and Boddu Dilip with music composed by Kalyan Keys. Directed by Icon RK, this captivating song brings alive the beats of local traditions with a modern twist. Featuring Icon RK Maliya, the visuals promise a delightful treat for music lovers. Enjoy the catchy tunes and share your thoughts in the comments below!

Credits :

Lyrics, Concepts & Direction : ICON RK - 9701162369
Cast : ICON RK MALIYA
Singers: Srinidhi & Boddu Dilip
Music Director: Kalyan Keys
Dop & Editing : Rajesh Patel
Co-Director : Shiva Yerra
Costume designer : Rhoea
Manager : Mahesh Devaruppula
Coordination : Sai Kiran
Producer : Jyoti Raj

Special thanks to :
Prasad Manukota
Rooma
Mahadev

Instagram link :

#AadivaaramAngadisong #IconRK #BodduDilip #Srinidhi #KalyanKeys #FolkMusic #TeluguFolkSongs #IconTunes #MelodyHits #FolkBeats #NewSong2024 #TeluguSongs #FolkMusic #TeluguHits #Telanganafolk #NewfolkSongs #SomaramAngadisong #MangalaramAngadisong #BudaramAngadi #SukkuraramAngadi #KatukakannulaSong #EdedujanmaluSong #singersrinidhi #Angadisong

Copyright Claim:
This video and its content, including music, lyrics, and visuals, are the intellectual property of Icon Tunes. Unauthorized use, distribution, or reproduction of this content without express permission is strictly prohibited. All rights reserved © 2024 by Icon Tunes.

పల్లవి :

అతడు :
ఆదివారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి..
ఆరు గజాల చీర తెచ్చిన.. ఓ లచ్చగుమ్మడి

ఆదివారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి..
కట్టుకోవే నేను తెచ్చిన చీర.. ఓ లచ్చ గుమ్మడి..

ఆమె :
ఎన్నెలతోని సావాసం ఓ లచ్చ గుమ్మడి
ఏడు రోజుల వనవాసం ఓ లచ్చ గుమ్మడి

అతడు :
సోమవారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి.
సొగసైన నడుముకి వడ్డానం తెచ్చిన.. ఓ లచ్చ గుమ్మడి..
మంగళవారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి..
మెరుపుల మణిహారం తెచ్చిన పిల్ల వేసుకోవే అమ్మడి

ఆమె :
వడ్డాణం మనిహారం ఓ లచ్చగుమ్మడి
మనువాడిన నువ్వే బంగారం ఓ లచ్చ గుమ్మడి

అతడు :
బుదారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి..
బుద్ధి తీరే ముక్కుపుడక తెచ్చిన.. పెట్టుకోవే అమ్మడి
గురువారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి..
గల్ గల్ మోగే గాజుల తెచ్చిన.. వేసుకోవే అమ్మడి

ఆమె :
ముక్కు పుడుకు ముద్దుగుంది ఓ లచ్చగుమ్మడి
గాజులు సప్పుడు నీ గుండె గూటిలో ఓ లచ్చగుమ్మడి

అతడు :
సుక్కురారం అంగడి.. ఓ లచ్చ గుమ్మడి
సక్కనైన నీ కళ్లకి కాటుక తెచ్చిననే అమ్మడి
శనివారం అంగడి ఓ లచ్చ గుమ్మడి
చమంతి పాదాలకి పట్టీలు తెచ్చిన వేస్తానే అమ్మడి..

ఆమె :
కాటుక కన్నుల వెన్నెల నువ్వే ఓ లచ్చ గుమ్మడి
నా పాదం నీ ఏంటా సాగుతుంది ఓ లచ్చ గుమ్మడి

అతడు :
ఏరి కోరి ఏడు అంగట్లు తిరిగోచ్చానే అమ్మడి.
ఏడేడు జన్మలు ఏకమై ఉందమే.. ..ఓ లచ్చమ్మ గుమ్మడి

ఆమె :
నీ గుండె గూటిని గుడిచేసేకుంట ఓ లచ్చగుమ్మడి
ఏడేడు జన్మలు నీ తోడుగా ఉంటా ఓ లచ్చ గుమ్మడి
Рекомендации по теме
Комментарии
Автор

వందల కోట్లు పెట్టిన తీసిన సినిమా పాటల్లో ఇంతటి మాధుర్యం లేదు సూపర్

swamyswamym
Автор

అమెరికాలో నివసిస్తూ తెలుగు ఫోక్ సాంగ్ లో ఇంత అద్భుతమైన హావభావాలను కనబరిచిన అమ్మాయికి కంగ్రాట్యులేషన్స్...

parshramkore
Автор

ఏడు రోజులుగా కనపడకుండా పోయిన భర్త కోసం దిగులుపడుతూ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న భార్యకు, sudden గా భర్తను చూసి అలకబూనిన భార్యగా మాలియ, అలిగిన భార్యను బుజ్జగిస్తూ ఏడు రోజుల పాటు కనపడకుండా పోయిన భర్త, తన ఏడు రోజుల అజ్ఞాతవాసం తన భార్య కోసమే అనే నేపథ్యం.. వారి మధ్య ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు.. అన్నీ చాలా అద్భుతంగా చేశారు.. అద్భుతమైన నటనతో రాజ్ కుమార్ సార్, మాలియాలు ఎప్పటికీ గుర్తుండిపోతారు.. ❤️❤️❤️

raghavendrav
Автор

తేలికైన పదాలు
బరువైన భావాలు
సరళమైన స్వరాలు
వారమంతా వరాలు
భారమైన బాధ్యతలు
మధురమైన బంధాలు
కలగలిపిన కమ్మని ఈ గేయం
ప్రతి గుండెకు చేసింది గాయం. ఆ గాయానికి ఆ నటి చిరునవ్వులే చికిత్స.

rajeshmodem
Автор

హీరోయిన్ గారి expressions ki ❤❤❤❤❤ ఒక like వేసుకోండి 🎉🎉🎉🎉🎉

gnggoud
Автор

తెలంగాణ గల్ఫ్ సోదరులను ఎంతో ఆకట్టుకున్నది అన్న మన తెలంగాణ💚, సింగర్ శ్రీనిధి 🎤🥰& బొడ్డు దిలిప్ అన్న 🎤😎& తెలంగాణ డప్పు చప్పుడు కళ్యాణ్ అన్న🥁💝.

manchalasantosh
Автор

అద్భుతమైన విరహ గీతం సూపర్ సాంగ్ ఎన్నిసార్లు విన్న మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి చుట్టూ పచ్చని చెట్లు, పొలాలు, ఆ కట్టు బట్టు ఈ పాట వింటుంటే ఏదో తెలియని అనుభూతి, some thing ఇంకా ఏదో. మనసు శాంతి కలిగించే స్వచ్ఛమైన తెలుగు పాట. ఈ పాట రచయితగా డైరెక్టర్ గా యాక్టర్ గా చెసిన వారు మా గురువు గారు అయినా రాజకుమార్ sir చాలా సంతోషకరమైన విషయం.sir నేను మీ ఆన్లైన్ స్టూడెంట్ ని మీ క్లాసులు విని నేను చాలా వరకు సబ్జెక్టు నేర్చుకున్నాను sir. మీరు extraordinary teacher మీరు ఎప్పుడు ఇచ్చేది quantity కాదు sir quality.
Heartiest congratulation sir 💐 💐💐💐💐 is a small word, but we are too excited to see you this happy.be blessed, forever!🎉🎉🎉🎉🎉

KrishnaveniKoilada
Автор

మధ్యతరగతి భార్య భర్తల ప్రేమ ఇలాగే ఉంటుంది ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన పాటలు మీనుండి రావాలి

shankarvadluri
Автор

ధన్యవాదములు ఇలాంటి పాట అందించినందుకు కృతజ్ఞతలు.
మీకు.

kavaliraviteja
Автор

సార్ మట్టిలో మాణిక్యం అంటే విన్నదే తప్ప చూసింది లేదు సార్.. అలాంటిది ఇ పాట రూపకం గా మిమ్మల్ని ఇప్పుడు చూస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది సార్ పాట విన్నంత సేపు అమ్మ వొడిలో వున్నంత హాయిగా అంతే ప్రేమగా అంతే స్వచ్చంగా వుంది ...చాల మంది యువతికి మీరూ ఆదర్శం సర్ ....మీరూ ఈ రంగంలో వున్నత స్థాయీకి చెరుకుంటారు అని అచిస్తు ప్రేమతో మీ... విద్యార్ధి🙏🏻🔥

-Subinspectorofpolice-sw
Автор

రాజ్ కుమార్ అన్న మీ యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంది
ఈ పాట ఖచ్చితంగా పల్లె పల్లెను చుట్టుకొస్తది
మీ ఇద్దరు కూడా అద్భుతమైన నటనతో పాటకు జీవం పోశారు

All the best for your upcoming Projects Anna 👍

SIDDUSTUDYCIRCLE
Автор

తన భర్త కనిపించడం లేదు అని ఏడు రోజులు వనవాసం లా ఉందని భావిస్తూ చెప్తుంది, మరి నా భార్య నన్ను (CRPF) తలుచుకుంటూ ఆరు నెలలు పాట వేచి చూస్తోంది తనకి ఎంత నరకంలో ఉంటుందో అని ఈ పాటను చూశాక తెలుసుకున్న, నిజంగా ఈ పాట చూశాక నా జీవితంలో నేను ఎం కోల్పోయాను తెలుసుకున్న, Thank you So Much our TEAM ❤

nareshkottisa
Автор

సూపర్ రా మామ. వెంకటేశ్వర సుప్రభాతం లా ప్రతి ఇంట్లో ఈ పాట వినిపిస్తుంది. అతి త్వరలో 200 మిలియన్లకు చేరుకుంటుంది video. All the best ra mamma❤❤❤❤

ICONGANESHSIROFFICIAL
Автор

ఏడు అంగళ్లు.. ఏడు కానుకలు.. ఏడు జన్మలకు బాస.. బాగుంది తమ్ముడు..రాజ్ కుమార్...Super Brother.. Keep it up.!!

tshivaprasad
Автор

🩵🩵వెన్నెలతోనే సావాసం ఓ లచ్చా గుమ్మడీ…ఏడు రోజులా వనవాసం …👌👌👌
నీ గుండె గూటిని గుడి చేసుకుంటా ఓ లచ్చా గుమ్మడీ….ఏడేడు జన్మాలు నీతోనే ఉంటా ఓ లచ్చా గుమ్మాడీ….🩵🩵
అద్భుతమైన “ Lyrics “ ..,
అందమైన చిత్రీకరణ …
ఆకర్షణీయమైన యాక్టింగ్ …
అందరూ చూడాల్సిన ..” జానపద సాహిత్య కళాఖండం “

choutiseconomy
Автор

చాలా బాగుంది హృదయన్ని హత్తుకునేలా ఉంది ఈ పాట❤🎉
సాహిత్యం మరియు సంగీతం అద్భుతంగా వినసొంపుగా ఉన్నవి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే సాంగ్🥰😘

laxminarayanaagidi
Автор

వెల్ డమ్ రాజ్ డార్లింగ్.. లిరిక్స్, మ్యూజిక్, యాక్టింగ్, కెమెరా డిపార్ట్మెంట్ అన్నీ సూపర్. ఇది నీ తొలి సాంగ్ లాగా అన్పించట్లేదు. Congratulations and all the best

mekalalaxman
Автор

Lirics written super... ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

jajalaravi
Автор

ఆదివారం అంత అందంగా..
సోమవారం అంత సొగసరిగా..
మంగళవారం అంత మధురంగా..
బుధవారం అంత బుద్దిగా..
గురువారం అంత గుండె నిండుగా..
శుక్రవారం అంత శుభ్రంగా
శనివారం అంత శాంతంగా.. ఉంది
ఈ పాట !!
రచన గానం సంగీతం 👌🏾❤️

*@రామ్ బాకీ*
🎤 సింగర్ రైటర్ (యాదాద్రి)

RAMBAAKITUNES
Автор

పాట వింటే మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది చాలా అందంగా పాట అమ్మాయి మంచి experience excellent song

ntr_fan_of_you