Ee Dhuryodhana Dussasana Song Lyrics II Vijayashanti Song II Pratoghatana Movie Songs

preview_player
Показать описание
Thank you for watching the video….. If you like the video then click on like button share in your contacts and subscribe to my channel.
#pratighatanamovie#pratighatanamoviesong#eeduryodhanadussasanasong#eeduryodhanadussasanasonglyrics#eeduryodhanadussasanatelugusonglyrics#eeduryodhanadussasanasonglyricsintelugu#vijayashantimoviesongs#vijayashantisuperhitsongs#veturisongs
Рекомендации по теме
Комментарии
Автор

వేటూరి..ఎంత సేపు పట్టింది ఆ మహానుభావుడికి ఈ పాట పదాల కూర్పు కి

lhsilhs
Автор

ఈ పాటకు జాతీయ అవార్డు ఎందుకు రాలేదో తెలియదు దక్షిణాది సినిమా పాటలకు జాతీయ అవార్డులు ఎందుకు ఇవ్వరు అర్థం కాదు నూటికి నూరు శాతం నేషనల్ అవార్డు పొందగలిగిన అద్వితీయ మహోన్నత మహత్తర సాహిత్య విశ్వరూపం ఈ వేటూరి రచనా మృతం మహానుభావా ఎక్కడున్నావయ్యా

venkatavr
Автор

జానకి గారు🙏🙏🙏🙏 మహనీయుల సృష్టి ఇలాంటి పాటలు

nagalakshmi
Автор

మానవ సమాజానికి కళ్ళు తెరిపించే మహా అద్భుతమైన పాట ఎన్ని సార్లు విన్న తనివి తీరని భావ గాంభీర్యం ఇందులో ఉంది జై హింద్

suryanarayanachebrolu
Автор

ఈ దుర్యోధన దుశ్శాసన
దుర్వినీతలోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ
రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

పుడుతూనే పాలకేడ్చి
పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే
ముద్దుమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న
తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో
మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా
ఈనాడే మీకోసం
మరో మహాభారతం
ఆరవవేదం
మానభంగపర్వంలో
మాతృహృదయ నిర్వేదం నిర్వేదం

కన్న మహాపాపానికి
ఆడది తల్లిగ మారి
మీ కండలు పెంచినది
ఈ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే
తెల్లని నెత్తురుజేసి
పెంచుకున్న తల్లి
ఒక ఆడదని మరిచారా
కనబడలేదా అక్కడ
పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన
లేతపెదవి ముద్ర
ప్రతిభారత సతిమానం
చంద్రమతి మాంగల్యం
మర్మస్థానం కాదది మీ జన్మస్థానం
మానవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం
శిశువులుగా మీరు పుట్టి
పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని
ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ అయిన
ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు
నిర్వీర్వం అవుతుంటే
ఏమైపోతుంది సభ్యసమాజం
ఏమైపోతుంది మానవధర్మం
ఏమైపోతుంది ఈ భారతదేశం
మన భారతదేశం మన భారతదేశం

చిత్రం :  ప్రతిఘటన (11.10.1985)
తారాగణం : విజయశాంతి
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  జానకి

Sippy
Автор

Best Song, Hat's off to Veturi garu and S Janaki varu 🙏🙏🙏🙏🙏🙏💗🙏🙏🙏🙏🙏🙏🙏🙏

mokallaaruna
Автор

Marmam kadhu ni janma sthanam wt a lines superb take a bow sir

mallikamd
Автор

ఆడవారిలో మన అమ్మ, అక్క, చెల్లి, భార్య, బిడ్డ ఉన్నారని ప్రతి ఒక్కరూ ఇప్పటి సమాజంలో ప్రతి ఒక యువకుడు ఈపాట చూసి మహిళల పట్ల గౌరవంగా ఉంటారని కోరుకుంటాను.

regotinarasimha
Автор

Janaki Amma what an Expressions, Pitches, Emotions and Energy it's touches off Janaka Amma...❤

mano
Автор

🚩🚩🚩మర్మస్థానం కాదది మీ జన్మస్థానం. మనవతకి మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం.🚩🚩🚩

djnanisirimalla
Автор

పెడదారి పడుతున్న యువత గురించి అప్పట్లోనే ఎంతో బాగా వివరించారు

nandipatiprathap
Автор

అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామమూర్తి గారి అర్థవంతమైన గీతానికి కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర కోకిల యస్.జానకి గారు ఆలపించారు.

hemanth
Автор

ఈ పాట వచ్చి 34 ఏళ్ళు అప్పటికి ఇప్పటికి. ఆడాళ్ళు మగాళ్ళు ఎంతో మారారు ఈరోజుల్లో ఇప్పటి దుస్థితి వేటూరి వారికి అప్పుడే తట్టిందేమో. రొజూ ఈ పాటని బడుల్లో కాలేజీల్లో బస్సుల్లో రైళ్ళలో రోడ్లమీద మైకులు పెట్టి గంట గంటకి వినిపిస్తా ఉంటే, జానకమ్మ గొంతులో పలికిన ఆర్ద్రతతో అయినా దేశంలో అంటే.. ఇప్పటి యువత, బుర్రలు దొబ్బిన ఆడ మగ జన్నాల్లో ఎంతో కొంతన్నా మార్పు వస్తదేమో ఏమన్నా.... లేకుంటే తెలుగు తెలియట్లా పాటకి అర్ధం కుడా చెప్పమంటారో.

Ram-ulbm
Автор

ఇలాంటి సినిమాలు తీసినందుకు రామోజీరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇవ్వాలి.

mandatigopal
Автор

ఈ పాట రాసిన వారికి పాదాభివందనం. ఎంత అర్థం ఉన్న పాట

varaganianuradha
Автор

ప్రార్థనా గీతం గా ప్రతీ స్కూల్ లో పెట్టాల్సిన సాంగ్ ఇది

pandunaresh
Автор

Prathi school's and colleagues lo daily morning prardhana pata ga ee song pettali pata rasina veturi sundara ramamurthi gariki pata padina S janaki gariki na paadabi vandanalu

madhum
Автор

Janaki amma ఆ దేవుడు మావులకు అందరికి అమృతం ఇవ్వలేక మీ స్వరంలో ఉంచి అందరికి మీ గానం ద్వారా పంచుతున్నారు, అమ్మ

bigboss-vtuh
Автор

వేటూరి గారికి
జానకమ్మ గారికి
చక్రవర్తి గారికి
🙏

madhumandli
Автор

ఈ పాటను జానకి గారు కాకుండా వేరెవరు పాడినా పాటకు ఇంతగా న్యాయం చేయలేకపోయే వారేమో...ఈ పాటలో ప్రతి వాక్యం అమూల్యం, జానకి గారి ప్రతి శబ్దం హృదయాన్ని కదిలించేలా ఉంటుంది.

khadarpasha