#TelanganaTejam Song #KCR Movie #Shorts

preview_player
Показать описание
Watch & Enjoy Telangana Tejam From The Movie KCR (Keshava Chandra Ramavath).

Song Name : Telangana Tejam
Singers : Goreti Venkanna, Mano, Kalpana
Lyrics : Goreti Venkanna
Music : Charan Arjun

Movie Name : KCR (Keshava Chandra Ramavath).
Banner : Vibudhi Creations
Cast : Rocking Rakesh, Annanya Krishnan
Screenplay, Writing Producer : Rocking Rakesh
Cinematography & Director : 'Garudavega' Anji
Music Director : Telangana Maestro 'Charan Arjun'
Editor : Madhu
Art Director : Mahesh Ballant
Dialogues : Raj Kumar Kusuma
Chief Co-Director : Hemant
Co Director : Rama Rao, Undravatti Nagaraju
Manager : Ganesh Nayak
Executive Producer : Mudigonda Saikumar
PRO :Vamsi Shekar
Audio On Aditya Music

పల్లవి

పదగతులు స్వరజతులు పల్లవించిన నేల
తేనె తీయని వీణ రాగాల తెలగాణ
ద్విపద దరువుల నేల
యక్ష జ్ఞానపు శాల
పోతనా కవి యోగి
భాగవత స్కందాల
జయ గీతికై మోగెరా
తెలగాణ జమ్మి కొమ్మై ఊగెరా
సింగిడై పొంగిందిరా తెలగాణ
తంగెడై పూసిందిరా

చరణం1

శాతవాహన వీర శౌర్యమే తెలగాణ
ఇక్ష్వాక పాలనలో విలసిల్లే తెలగాణ
చాళుక్య ప్రాకార గోపురాదామాల
కాకతీయులె మేటి వారికెవ్వరు సాటి

ఎన్నెలా తిన్నెలా
ఎగిసేటి గోదారి
కొండకోనల మేన
కులికె కృష్ణావేణి
వన్నెలొలికే రాణి
మన కిన్నెరాసాని
చిలక వాగుల మేళ
చిందులేసే నేలా

శిలల కలతోరణం
యాదాద్రి దేవలం
వెలిసిన శివరేడు
వేములాడ జూడు
ధర్మపురిలో ప్రణవ నాదమే కదలాడు
వాసిగా చదువంపే
బాసరా తీర్థంబు

అంబ జోగులాంబ
ఆదిలో పీఠంబు
అల్లంపురం నదుల
తొలి నివాసంబది
సమ్మక్క సారలమ్మ తెలగాణ
రుద్రమ్మ రుధిర జన్మ

భద్రాద్రి రామసీతం తెలగాణ
గోల్కొండ గొప్ప చరితం

పాల్కురికి సోమన్న
బసవా పురాణంబు
దివి నుంచి దిగివచ్చి
కొలువైన తేజంబు
రామప్ప మందిరం
వేయి స్తంభాలయం
పద్యానికందము
అప్పకవి చందము

రంగనాదా
రామాయణా గానము
ప్రతి ముంగిలి
పరవశించి పాడుకుంది
కావ్య జగతికి దారి మల్లినాదసూరి
మధుర విజయము రాసే గంగావతి దేవి

మారన్న తెనుగన్న సోమనార్యుల గన్న
ఈనేల సాహిత్య
వైభవానా మిన్న
బతుకమ్మ భోనాలురా
పండగా సాయన్న గుండెసడిరా

పైడి జయరాజు కాంతారావు
ప్రభాకరుడి చిత్ర వెలుగు

చరణం 3

నాట్య రీతుల తెలిపె
నృత్య రత్నావళి
రసగంగనుప్పొంగే సింగభూపాలుడు

రౌద్ర పేరిణి బేరి జాయపాసేనాని
రాగమై రంజిల్లె
రామదాసుని బాణి

యోగియై చరియించే
వరకవి సిద్ధప్ప
సిందేసి తాళము
ఎల్లమ్మ మేళము
నూటొక్క రాగాల
పోటెత్తె కిన్నెర
భాగయ్య అల్లిక
రాగాల మల్లిక

కనుల ఎర్రని జీర
కాళోజి కవి ధార
ఎల్లలే దాటింది
దాశరధి పద్యంబు
రాక మాచర్ల
వెంకటదాసు యాలలు
రాళ్ల కరిగించె
చెన్నాదాసు రాగాలు

ఇద్దాసు తత్వాలు
ఇలపైన సత్యాలు
వేపూరి కీర్తనకు
ప్రతి పల్లె నర్తనా
తూటవలె సుద్దాల హనుమంతు కవిపాట
యుద్ధ నౌకా
గద్దరన్న జనగీతికా

విశ్వంభర జ్ఞానపీఠీ సినారే
వల్లంకి తాళమై
వొలికె నీ కవనాలె

అపర మేధావి మన పీవిరా
మిద్దె రాములు ఒగ్గుకథరా
వేల గొంతుకల ధ్వని గానము
మన వేణు మాధవుడి
శిష్య గణము..

చరణం4

బందగీ నెత్తుటి
సింధూరమీనేల
బరిగీసి నిలిచెరా
భీమిరెడ్డి భళా...

ఆరుట్ల రావినారాయణుని త్యాగాల
కొమరము భీముడి
సమర చైతన్యాల

కమలమ్మ,ఐలమ్మ,
మల్లు స్వరాజ్యాల
కదనాల మగువల
తెగువరా తెలగాణ

మలిపోరు తొలిపొద్దు
మన చంద్రశేఖరుడు
కల నిజముచేసిన
మన కథానాయకుడు
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!

SUBSCRIBE Aditya Music Channels for unlimited entertainment:

© 2024 Aditya Music India Pvt. Ltd.
Рекомендации по теме
Комментарии
Автор

Telangana pride song goreti venkanna ku padhabhivadhanallu kalpana voice goosebumps ❤❤

pavankalva