Yellipothavura Manishi Lyrical Video Song - Swathi Reddy || Bheems Ceciroleo || Latest Telugu Songs

preview_player
Показать описание
Yelli Pothavura Manishi Lyrical Video Song by Swathi Reddy || Bheems Ceciroleo || Singer Swathi Reddy Emotional Song Latest Telugu Songs 2020 .
#YelliPothavuraManishiSong #YelliPothavuraManishiFullSong #SingerSwathiReddy

yellipothavura manishi song, yellipothavura manishi full song, yellipothavura manishi telugu song,singer swathi reddy yellipothavura manishi song, yellipothavura manishi emotional song

Lyrics & Music Composer : Bheems Ceciroleo
Singer : Swathi Reddy
Aalap : Faizan Khan
Editor : Siva Y.Prasad
D.O.P : M.V.Prasad
Producer : Nagole Balreddy
Lonka Narender Reddy
Music Co-Ordinator : Malya Kandukuri
Recording Engineer : Mastan vali
Key Board : Sekhar Mopoori
Mixing : Kishore Kumar.S
Mastered by Artiflex Studio Cydney
Shooted In London
======================================
Official Streaming Youtube Channels :

𝗡𝗢𝗧𝗘: 𝗔𝗟𝗟 𝗖𝗢𝗡𝗧𝗘𝗡𝗧 𝗜𝗦 𝗦𝗨𝗕𝗝𝗘𝗖𝗧𝗘𝗗 𝗧𝗢 𝗖𝗢𝗣𝗬𝗥𝗜𝗚𝗛𝗧 𝗙𝗥𝗢𝗠 𝗦𝗪𝗔𝗧𝗛𝗜 𝗥𝗘𝗗𝗗𝗬 𝗨𝗞, 𝗔𝗡𝗬 𝗨𝗦𝗘 𝗢𝗥 𝗖𝗢𝗠𝗠𝗘𝗥𝗖𝗜𝗔𝗟 𝗗𝗜𝗦𝗣𝗟𝗔𝗬 𝗢𝗙 𝗧𝗛𝗘 𝗖𝗢𝗡𝗧𝗘𝗡𝗧 𝗪𝗜𝗧𝗛𝗢𝗨𝗧 𝗣𝗥𝗢𝗣𝗘𝗥 𝗔𝗨𝗧𝗛𝗢𝗥𝗜𝗭𝗔𝗧𝗜𝗢𝗡 𝗜𝗦 𝗟𝗘𝗚𝗔𝗟𝗟𝗬 𝗣𝗨𝗡𝗜𝗦𝗛𝗔𝗕𝗟𝗘 ...
@𝗗𝗼𝗻'𝘁 𝗖𝗼𝗽𝘆 𝗧𝗵𝗶𝘀 𝗦𝗼𝗻𝗴 𝗔𝗹𝗹 𝗥𝗶𝗴𝗵𝘁𝘀 𝗥𝗲𝘀𝗲𝗿𝘃𝗲𝗱.

ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే 𝗰𝗼𝗽𝘆𝗿𝗶𝗴𝗵𝘁 𝗦𝘁𝗿𝗶𝗸𝗲 పంపడం జరుగుతుంది ఫ్రెండ్స్ 𝗣𝗹𝗲𝗮𝘀𝗲 సహకరించండి

𝗧𝗲𝗰𝗵𝗻𝗶𝗰𝗮𝗹 𝗔𝗱𝘃𝗶𝘀𝗲𝗿 : 𝗥𝗼𝗻𝗶 𝗘𝗱𝗶𝘁𝗶𝗻𝗴 𝗦𝘁𝘂𝗱𝗶𝗼
#𝐑𝐨𝐧𝐢𝐎𝐫𝐢𝐠𝐢𝐧𝐚𝐥𝐬

Yellipothavura Manishi songs is just like evaru rammannaru koduka song, very emotional heart touching song in telugu 2020, please subscribe our channel and support like telugu folk songs channels,
Рекомендации по теме
Комментарии
Автор

ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
జీవితం చిన్నదేరా మనిషి జన్మ గొప్పది
ఎంతో విలువ ఐనది
శాశ్వతం కాదు లేరా దేహం మరణమున్నది
శాశ్వతం చేసుకోరా నీ పేరు అన్నది
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి

రాళ్ళను రాజేసి నిప్పు పుట్టించావు
నేలను సరిచేసి పంట పండిచావు
సంద్రాలనే ఈది ఖండాలనేదాటి
అరచేతిలోభూ మండలం పట్టావు
అంతరిక్షంలోకి అడుగు పెట్టేశావు
అనంత విశ్వాన్ని అన్వేషిస్తున్నావు
చెమటపట్టని ఒంటికి చెదలు పట్టినట్టు
రోగాల రొంపిలో తగలబడుతున్నావు
ఎన్నో సృష్టించావు కదరా
సృష్టి ధర్మమెట్ట మరిచావురా
అద్భుతాలే చేశావురా
అందులో బ్రతకడమే నీకు రాదురా
అంటిముట్టనట్టు ఏందిరా
భూమి అంటరానిదేమి కాదురా
పంచభూతాలు పనివాళ్ళు కాదురా
నిన్ను నడిపించే పంచేంద్రియాలురా
అంతట నాదన్నావు
అందరికి దూరమయ్యావు
ఒంటరిగ మిగిలిపోయావు కదరా

ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి

పండగొస్తే ఇంటికొచ్చే చుట్టాలేరి
కష్టాల్లో కలిసొచ్చే ప్రాణస్నేహితులేరి
తలకొరివి పెట్టేటి కొడుకులేరి
నువ్వు తలనీలాలిచ్చిన దేవుళ్లేరి
మనసిప్పి మాట్లాడే మనవాళ్ళంటు ఏరి
మనవాళ్ళలో మరి నీవాళ్ళంటు ఏరి
గెలిచి వస్తే భుజము తట్టేవాళ్ళు ఏరి
పడిపోతే చెయ్యేసి లేపేవాళ్ళేరి
నీ గుణము గొడ్డలైంది కదరా
భూమి గుండె బద్ధలైంది చూడరా
నీ ధనము దయలేనిది కదరా
ఎన్నో యుద్ధాలనే చేయిస్తుందిరా
మట్టిలొపుట్టావు కదరా
మట్టి వాసనెట్ట మరిచావురా
నువ్వు మనిషి పుట్టుకెత్తినావురా
నీకు మనసన్నదే లేదు కదరా
నమ్మకాన్ని అమ్ముకున్నావు
పద్ధతుల్ని పాతరేశావు
విలువలకు శిలువలేశావు తప్పు కదరా

ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి

ఇంటిమీద వాలే బురకపిట్టలు ఏవి
సేలల్లో వాలేటి రామచిలుకలు ఏవి
కొండల్లో పచ్చని అడవితల్లి ఏది
అడవుల్లో నివసించే జీవులేవి
చెరువుల్లో మొలిచిన మట్టిపెల్లలు ఏవి
నదులల్లోఎదిగిన ఇసుక రేణువులేవి
గుట్టల్లో ఒదిగిన రాళ్ళగుంపులు ఏవి
వాగుల్లో ఒర్రెల్లో ఊట సెలిమెలు ఏవి
అంతరించిపోలేదురా
నువ్వే అంతమొందించావు గదరా
దాని ఉసురు ఊరికే పోదురా
మనిషి ఉనికినే ప్రశ్నిస్తు ఉందిరా
వెక్కి వెక్కి ఏడుస్తుందిరా
భూమి గొంతునొక్కి చంపబోకురా
నిన్ను ఎత్తుకొని ఆడించిందిరా
కళ్ళకత్తుకొని దీవించిందిరా
గాలిలో తేమలా పువ్వులో తేనెలా దివ్వెలో వెలుగులా ఉండవేందిరా

ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఎల్లిపోతావురా మనిషి ఏదో ఓనాడు ఈభూమి వదిలేసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి
ఉండాలిరా కలిసి మెలిసి అరే ఉన్నన్నాళ్ళు కొంత తెలిసి om

BheemsCeciroleo
Автор

E okka pata tho jivitham ante emo telusthundi.super hatsuf

Krishna
Автор

జీవితం గురించి చాలా బాగా వివరించారు అండీ మీకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

kalyankumarkumar
Автор

ఉండాలి రా, కలిసి మెలిసి
ఉన్నన్ని నాళ్లు. కొంత తెలిసి👌

thelittlegirl
Автор

చాలా బాగా రాసారు సాంగ్, ఇలాంటి వీడియోస్ చూసి కూడా మనిషిలు మారడం లేదు, ఎప్పుడు మారుతారు అర్ధవడం లేదు. నైస్ మెసేజ్ థాంక్స్.

landaadinarayana
Автор

Singer SWATHI medam ki haatsaap....
👍👍👍👍👍👍👍👍👍👍👍

konetivenkateswerlu
Автор

ఓక్కసారి విన్ని మల్లి విన్నాలి అనుపిన్చిన వాల్ ok like veskonde

krishnakanth
Автор

ఇది పాట కాదు జీవితం. మనిషి తెలుసుకోవాల్సిన జీవిత సత్యం

karunakersoppari
Автор

Enni sarlu vinna vinalanipinche pata . 👌👌👌Singing. Real facts Baga chepparu lyric writer ki kuda 👏👏👏👏

nalinikuchipudi
Автор

సూపర్ సాంగ్ భావం తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

ashok
Автор

ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు, పాడిన వారికి, సంగీతం అందించిన వారికి అభినందనలు.
Superb.

padmajacheethirala
Автор

Adbhutam... Amma... Chaala baga cheppavu... I'm 60 now. Really an emotional for me. Thank you amma.

muralikrishnahanumantu
Автор

చాలా చక్కగా రాశారు
చాలా అర్ధాలు ఉన్నాయి పాట లో

sanjaypalaparthi
Автор

ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపించేలా పాడిన "స్వాతిరెడ్డి" గారికి, అంతే అందంగా పదాలను కూర్చి, మనసుకు హత్తుకునేలా సంగీతాన్ని అందించిన మా "భీమ్స్" అన్నకి హృదయపూర్వక అభినందనలు....💐💐💐💐💐
మీరు ఇలాగే ఇంకా గొప్ప గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న....👍👍👍👍💐💐💐
"ఎల్లిపోతావురా మనిషీ...
ఏదో ఓనాడూ... ఈ భూమి వదిలేసి...
ఉండాలిరా కలిసి మెలిసి.. అరే ఉన్నన్నాళ్లు కొంత తెలిసీ...."
ఆహా....👌👌👌👌💐💐💐💐💐

kiran-yz
Автор

Happy vinyakachavithi Swathi Reddy Yellipothavura Manish Super So song happy Vinayaka chaturthi Swati Reddy gari ki elante patalu mareno padalini man Ko Rika

kishanrenuguntuwar
Автор

Manishi jeevitham ee okka song lo chupinchaaru nenu Swathi gaarini sridevi drama company program lo chusaanu e song vinnanu ventane YouTube lo e song vinnanu appati nundi daily vintaanu Thank you etha manchi paata raasina vaariki paadina Swathi gariki 🙏🙏🙏

kumpatlaannapurna
Автор

నేను వంద సార్లు విన్నా. !!
నుటోక్కసార్లు వినాలనిపిస్తుంది..!!!
అందమైన స్యచ్చ తెలుగు పదాల పల్లవి వేసుక్కోండీ ఒక

muraligoud
Автор

Paata raasina athanu chala goppavadu 🙏
Paata paadina bhumata Swetha reddy chala chala goppavaru 🙏👍

prasaddkandaggiri
Автор

ఇంత చక్కని పాటను వ్రాసిన రచయితకు, పాడిన వారికి, సంగీతం అందించిన వారికి అభినందనలు.

Sathishsamala
Автор

పాటలో నిజం వినిపించడం మే కాదు నిజం చూపించారు అనిపిస్తుంది 👍ధన్యవాదములు 👏రచించినవారికి 👏పాడినవారికి 👍

dokkaajaybabu