Nizamabad Govt Hospital Superintendent Dr. Pratimaraj Responde On ETV Story

preview_player
Показать описание
చిట్టి ప్రాణం.. పెద్ద గండం.. బతికించండి సారూ... ఈటీవీ కథనానికి నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డా.ప్రతిమారాజ్ స్పందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం రాంపూర్ కి చెందిన శ్రీకాంత్, హారిక దంపతుల కుమారుడు శివకుమార్‍ 5 నెలల వయసు నుంచి హైడ్రో సెఫలస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఉన్న ఆస్తులు అమ్ముకుని వైద్యం చేయించినా...ఫలితం లేదు. దీంతో ఈనెల 3న తన కుమారుడితో కలిసి తల్లి ప్రజావాణికి వచ్చింది. తన కుమారుడిని బతికించాలంటూ అధికారులను వేడుకుంది. వయసుకు మించి పెరిగిన తలతో బాలుడి అవస్థను ఈనెల 3న ఈటీవీ ప్రసారం చేసింది. కథనానికి స్పందించిన నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్.. ప్రత్యేక చొరవతో ...నాలుగు రోజులు వైద్యం అందించారు. అనంతరం హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి... అక్కడి వైద్యులతో మాట్లాడి సరైన వైద్యం అందేలా చూశారు. శివకుమార్ కు ఈనెల 8న శస్త్ర చికిత్స చేయగా.. విజయవంతమైంది.
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

E TV variki sahasrakoti padabhi vandanalu

rrrsss