Swati Maliwal Assault Case | NCW Summons Delhi CM Kejriwal's Close Aide Bibhav Kumar

preview_player
Показать описание
ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ పై దాడి చేసిన కేసులో....... దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సమన్లు జారీ అయ్యాయి. భిభవ్ కుమార్ కు....... జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా..... ఈ కేసును సూమోటోగా స్వీకరించినట్లు NCW స్పష్టం చేసింది. శుక్రవారం....... ఉదయం 11 గంటలకు మహిళా కమిషన్ కార్యాలయంలో...... విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఇరుపక్షాలు వ్యక్తిగతంగా............. హాజరుకావాలని వెల్లడించింది.
అటు ఆ కేసుకు సంబంధించిన వివరాలు సేకరించడానికి దిల్లీ పోలీసులు........ మాలీవాల్ నివాసానికి వెళ్లారు. ACP ర్యాంకు అధికారి నేతృత్వంలోని ఓ బృందం స్వాతి నివాసానికి వెళ్లి వివరాలు సేకరించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు... ఈ ఘటన గురించి సీఎం కేజ్రీవాల్ ను మీడియా ప్రశ్నించగా...... సమాధానం ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఉత్తర్ ప్రదేశ్ లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి.......... ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేజ్రీవాల్ కు ఈ ప్రశ్న ఎదురైంది. దానిపై సీఎం మౌనం వహించగా..ఆ పార్టీ నేత సంజయ్ సింగ్ మైక్ తీసుకొని ఎదురుప్రశ్నలు వేశారు. కేజ్రీవాల్ ను కలవడానికి సీఎం నివాసానికి వెళ్లిన స్వాతి మాలీవాల్ తో...... బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డాడు. ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఆప్ పార్టీ నేత సంజయ్ సింగ్ అంగీకరించారు. బిభవ్ పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

JAI modi Jai BHARAT Jai B J P JAI modi Jai BHARAT Jai B J P 💯💯💯

rameshsirisha