2/4 tabala

preview_player
Показать описание

Рекомендации по теме
Комментарии
Автор

నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||

ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్టూరమైననూ (2) ||నీ మాట||

బ్రతుకు నావ పగిలినా కడలి పాలైననూ
అలలు ముంచి వేసినా ఆశలు అనగారినా (2) ||నీ మాట||

ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా (2) ||నీ మాట||

నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము
నీదు కృపతో నాకేమియు కాదిల సమానము (2) ||నీ మాట||

PastorYehoshuvaYemmiganur
Автор

నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4)        ||నీతో||

మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2)         ||యేసయ్యా||

గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2)         ||యేసయ్యా||

Digitalvenkatesh
Автор

ప్రేమపూర్ణుడా - స్నేహశీలుడా
విశ్వనాధుడా- విజయవీరుడా
ఆపత్కాలమందున - సర్వలోకమందున్న
దీనజనాళి దీపముగా - వెలుగుచున్నవాడా
ఆరాధింతు నిన్నే- లోకరక్షకుడా
ఆనందింతు నీలో-జీవితాంతము
నీకృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి
నీ కృపయందు తుదివరకు నడిపించు యేసయ్య ||ప్రేమపూర్ణుడా ||


1. పూర్ణమై - సంపూర్ణమైన - నీదివ్య చిత్తమే
నీవు నను నడిపే నూతనమైన జీవమార్గము ||2||
ఇహమందు పరమందు ఆశ్రయమైనవాడవు
ఇన్నాళ్లు క్షణమైనా నను మరువని యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||



2. భాగ్యమే - సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి
బహు విస్తారమైన నీకృప నాపై చూపితివి ||2||
బలమైన - ఘనమైన నీనామమందు హర్షించి
భజియించి - కీర్తించి ఘనపరతు నిన్ను యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||


3. నిత్యము - ప్రతి నిత్యము నీ జ్ఞాపకాలతో
నా అంతరంగమందు నీవు-కొలువై వున్నావులే ||2||
నిర్మలమైన నీ మనసే - నా అంకితం చేసావు
నీతోనే జీవింప నన్ను కొనిపో-యేసయ్య
నా తోడు నీవుంటే అంతే చాలయ్య
నాముందు నీవుంటే భయమే లేదయ్యా ||2|| ||ప్రేమపూర్ణుడా ||

mojespal
Автор

కృపా క్షేమము నీ శాశ్వత జీవము
నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు (2)
మహోన్నతమైన నీ ఉపకారములు
తలంచుచు అనుక్షణము పరవశించనా
నీ కృపలోనే పరవశించనా

నా ప్రతి ప్రార్ధనకు నీవిచ్చిన ఈవులే
లెక్కకు మించిన దీవెనలైనాయి (2)
అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే
కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను (2)
నీ వాక్యమే మకరంధమై బలపరిచెను నన్ను
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నీ సత్య మార్గములో ఫలించిన అనుభవమే
పరిమళింపచేసి సాక్షిగ నిలిపాయి (2)
కలతచెందక నిలిపినది నీ దివ్య దర్శనమే
గమ్యము చేరే శక్తితో నను నింపి నూతన కృపనిచ్చెను (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
నా యేసయ్య స్తుతిపాత్రుడ ఆరాధన నీకే (2)
ఆరాధన నీకే ||కృపా క్షేమము||

నా ప్రాణ ప్రియుడా నన్నేలు మహారాజా
నా హృది నీ కొరకు పదిలపరచితిని (2)
బూరశబ్దము వినగా నా బ్రతుకులో కలలు పండగా
అవధులులేని ఆనందముతో నీ కౌగిలి నే చేరనా (2)
ఆరాధ్యుడా అభిషిక్తుడా ఆరాధన నీకే
ప్రాణేశ్వరా నా యేసయ్య ఆరాధన నీకే (2)

pavanpeters
Автор

విజయ గీతము మనసార నేను పాడెద
నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు (2)
పునరుత్తానుడ నీవే
నా ఆలాపన నీకే నా ఆరాధన (2)

ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే
పుటము వేసితివే నీ రూపము చూడ నాలో (2)
యేసయ్యా నీ తీర్మానమే నను నిలిపినది
నీ ఉత్తమమైన సంఘములో (2) ||విజయ||

ఒకని ఆయుషు ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో (2)
యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము
నీ పరిశుద్ధులలో చూపినది (2) ||విజయ||

నూతన యెరుషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరక్షణయే రగులుచున్నది నాలో (2)
యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించె
నీ ప్రసన్న వదనమును ఆరాధించ (2) ||విజయ||

harshiniperam
Автор

నేనెల్లప్పుడు యెహోవా నిను సన్నుతించెదను (2)
నిత్యము నా కీర్తి నా నోట నుండును (2)
మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా
చావైనా బ్రతుకైనా నీకోసమేనయ్యా (2) ||నేనెల్లప్పుడు||

కలిమి చేజారి నను వంచినా
స్థితిని తలకిందులే చేసినా (2)
రెండింతలుగా దయచేసెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

పరుల ఎగతాళి శృతి మించినా
కలవరము గుండెనే పిండినా (2)
నా మొఱ విని కృప చూపెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

శ్రమలు చెలరేగి బెదిరించినా
ఎముకలకు చేటునే తెచ్చినా (2)
ఆపదలలో విడిపించెదవని (2)
నాకు తెలుసునయ్యా.. మంచి యేసయ్యా ||మేలైనా||

SamuelYemmiganur
Автор

పునరుత్థానుడా విజయశిలుడా నా ప్రాణనాధుడా {2}
నా ప్రతి అవసరము తీర్చినట్టి యేసునాధుడా
నా అపజయములలో జయమునిచ్చిన కారుణశిలుడా {2} || పునరుత్థానుడా ||

కొండలు లోయలు ఎదురైన జడియాను యేసయ్య
శోధన వేధన భాదాలలో నిన్ను విడువను యేసయ్య {2}
నాకున్న తోడు నీడ నేవే నాదు యేసయ్య {2}
ప్రేమపూర్ణుడా నా స్తుతికి పాత్రుడా {2} || పునరుత్థానుడా ||

మోడు బారిన నా జీవితం చిగురించేనయ్య
అంధకారం తొలగించే వెన్నెల నీవయ్యా {2}
నా చేయి పట్టి నన్ను నడిపిన రాజువు నీవయ్యా {2}
మహిమ నాధుడా నా ప్రేమపాత్రుడా {2} || పునరుత్థానుడా ||

చరణం:-నాదు యాత్ర ముగియగానే నిన్ను చేరేదానేసయ్య
కన్నులారా నా స్వామిని చూచెదా నేనయ్య {2}
ఆ మహిమకు నన్ను పిలచుకున్న పరిశుద్దత్ముడా {2}
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీకయ్య {2} || పునరుత్థానుడా ||

NaveenKumar-eqpf
Автор

నజరేయుడా నాయేసయ్యా - ఎన్నియుగాలకైనా
ఆరాధ్య దైవం నీవేనని - గళమెత్తి నీకీర్తి నే చాటెద } 2

ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి } 2
శూన్యములో ఈ భూమిని వ్రేలాడదీసిన నా యేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2|| నజరేయుడా ||

ఆగాధ సముద్రాలకు - నీవే ఎల్లలు వేసితివి } 2
జలములలో బడి నేవెళ్ళినా - నన్నేమి చేయవు నాయేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2|| నజరేయుడా ||

సీయోను శిఖరాగ్రము - నీ సింహాసనమాయెనా } 2
సీయోనులో నిన్ను చూడాలని - ఆశతో ఉన్నాను నాయేసయ్యా } 2
నీకే వందనం - నీకే వందనం } 2|| నజరేయుడా ||
Tags Hosanna

filomand..
Автор

సుగుణాల సంపన్నుడా
స్తుతిగానాలవారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము

యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడెను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే|| సుగుణాల ||

యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించగలవు
నేను నడువ వలసిన త్రోవలో|| సుగుణాల ||

యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమయెదుట
ఇవి ఎన్న తగినవి కావే|| సుగుణాల ||

ribkabhanu
Автор

ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే 

లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ ||

నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ ||

పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి|| ఆశ్రయ ||

నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా!|| ఆశ్రయ ||

Enosh-M
Автор

ఒక క్షణమైన నిను వీడినా
నేనే మౌదునో తెలియదయ్యా (2)
ప్రభు నీతోడు నీ నీడలో
నేనిలా బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||

అపవాది శోధనలు నను చుట్టినా
ఇహలోక శ్రమలు నాకెదరొచ్చినా (2)
ఆశ్రయమైన నీ నీడలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా (2) ||ఒక||

కునకక ఎన్నడు నిద్రించక
నీ కనుపాపలో కాపాడువాడవు (2)
కాపరివైన నీ మందలో
నేనిల బ్రతుకు చున్నానయ్యా

hemanthrayalking
Автор

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2)        ||యేసయ్యా||

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2)      ||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2)      ||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2)

programmingknowledge
Автор

నేనెందుకని నీ సొత్తుగా మారితిని సాంగ్, ప్రేమించెదన్ అధికముగా సాంగ్, రాజాది రాజా రవికోటి తేజ సాంగ్, కృపా సత్య సంపూర్ణుడా సాంగ్, ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు సాంగ్, సర్వయుగములలో సజీవుడవు సాంగ్, నజరేయుడా న యేసయ్య సాంగ్, ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సాంగ్, యూదా స్తుతి గోత్రపు సింహమా సాంగ్, మహా మహిమతో నిండిన సాంగ్, ఈ పాటలకు ఈ ట్రాక్ ఉపయోగించవచ్చు.ఇంకా మరి కొన్ని కూడా.దేవునికి సమస్త మహిమ చెందును గాక!ఆమెన్

arundas
Автор

నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
నాప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||

చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||

నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||

తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||

sudharshancheruku
Автор

సర్వ యుగములలొ సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా

ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే } 2
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా } 2|| సర్వ ||

స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే } 2
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా } 2|| సర్వ ||

కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను } 2
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా } 2

ribkabhanu
Автор

ప్రార్థన వలనే పయనము
ప్రార్థనే ప్రాకారము
ప్రార్థనే ప్రాధాన్యము
ప్రార్థన లేనిదే పరాజయం||2||
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

ప్రార్ధనలో నాటునది
పెల్లగించుట అసాధ్యము
ప్రార్ధనలో పోరాడునది
పొందకపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో ప్రాకులాడినది
పతనమవ్వుట అసాధ్యము||2||
ప్రార్ధనలో పదునైనది
పనిచేయ్యకపోవుట అసాధ్యము||2||
ప్రభువా ప్రార్థన నేర్పయ్యా
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

ప్రార్ధనలో కనీళ్లు
కరిగిపోవుట అసాధ్యము
ప్రార్ధనలో మూలుగునది
మారుగైపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో నలిగితే
నష్టపోవుట అసాధ్యము||2||
ప్రార్ధనలో పెనుగులాడితే
పడిపోవుట అసాధ్యము||2||
ప్రభువా ప్రార్ధన నేర్పయ్యా
ప్రార్ధించకుండా నే ఉండలేనయ్యా||2||
నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయ్యా||2||
||ప్రార్థన వలనే పయనము||

Digitalvenkatesh
Автор

ముఖ దర్శనం చాలయ్యా - Mukha Darshanam Chaalayyaa
ముఖ దర్శనం చాలయ్యా
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)

కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||

repallyjamesanand
Автор

నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా – (2) ||నేనంటే||

నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను వీడిపోయినా – నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము – నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

SamuelYemmiganur
Автор

పాడెద స్తుతి గానము - కొనియాడెద నీ నామము || 2 ||

నీవే నా ప్రేమానురాగం - క్షణమైన విడువని స్నేహం
అతిశ్రేష్టుడా నా యెస్సయ్యా  || 2 ||  
 || పాడేద ||

1. ఇల నాకెవ్వరు లేరనుకొనగా - నా దరి చేరితివే
 నే నమ్మినవారే నను మరచినను - మరువని దేవుడవు || 2 ||
నీ ఆశాలే నాలో చిగురించెను - నీ వాక్యమే నన్ను బ్రతికించెను || 2 ||
నీ అనుబంధము నాకానందమే ||2||   || పాడేద ||

2. నా ప్రతి అణువును పరిశుద్ధపరచెను -  నీ రుధిదారాలే

నీ దర్శనమే నను నిలిపినది - ధరణిలో నీ కొరకే    || 2 ||
నీ చేతులే నను నిర్మించెను - నీ రూపమే నాలో కలిగెను   || 2 ||
నీ అభిషేకము పరమానందమే || 2 ||    || పాడేద |

3. బలహీనతలో నను బలపరచి - ధైర్యము నింపితివే 

నా కార్యములు సఫలముచేసి  - ఆత్మతో నడిపితివి || 2 ||
యూదగోత్రపు కొదమ సింహమా - నీతో నిత్యము విజయహసమే || 2 ||
నీ పరిచర్యలో మహిమానందమే   || 2 ||    || పాడేద

rebbaprasannakumar
Автор

యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా..
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా
నీవే నీవే నా రాజువయ్యా (2)
యేసయ్య యేసయ్య యేసయ్యా…

కొండలలో లోయలలో
అడవులలో ఎడారులలో (2)
నన్ను గమనించినావా
నన్ను నడిపించినావా (2) ||యేసయ్యా||

ఆత్మీయులే నన్ను అవమానించగా
అన్యులు నన్ను అపహసించగా (2)
అండ నీవైతివయ్యా
నా.. కొండ నీవే యేసయ్యా (2) ||యేసయ్యా||

మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప (2)
నన్ను బలపరచెనయ్యా
నిన్నే ఘనపరతునయ్యా (2) ||యేసయ్యా||

వంచెన వంతెన ఒదిగిన భారాన
ఒసగక విసిగిన విసిరె కెరటాన (2)
కలలా కడతేర్చినావా
నీ వలలో నను మోసినావా (2) ||యేసయ్యా||

jesusgiftfaithfamily