IAMC @Hyderabad | Resolving of Personal & Commercial Disputes of Public | Idisangathi |

preview_player
Показать описание
ప్రజాస్వామ్య దేశాల్లో కోర్టుల పాత్ర చాలా కీలకం. ఎందుకంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు లేదా వ్యక్తులు ఎవరూ తప్పు చేసిన హెచ్చరించే లేదా శిక్షించే హక్కు వీటికుంది. అలాంటి కోర్టుల చుట్టూ కేసుల పరిష్కారం కోసం నిత్యం లక్షల మంది తిరుగుతున్నారు. మన దేశంలోనే లక్షల్లో కేసులు పరిష్కారానికి నోచుకోవడం లేదు. దీనికి అనేక కారణాలు. మౌలిక సదుపాయాలు, సిబ్బంది కొరత ఇలా చాలా రకాల సమస్యలు వేధిస్తున్నాయి. వీటి మధ్య కేసుల పరిష్కారం కావడం లేదు. మరి, ఎలా? కోర్టుల చుట్టూ తిరగలేం, కోర్టులకు వెళ్లలేం అనుకున్న వాళ్ల కోసం మేము మధ్యవర్తిత్వం వహిస్తామంటున్నాయి... ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ లు. అతి తక్కువ సమయంలోనే సమస్యలు పరిష్కరించి సత్వరన్యాయం చేస్తామంటున్నారు వీటి నిర్వహకులు. ప్రపంచదేశాలలో ఎప్పటి నుంచో ఇవి ఉండగా.. భారత్ లోనూ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సంస్కృతి ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తోంది. హైదరాబాద్ లో గతేడాదే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ ప్రారంభమైంది. వ్యక్తిగత, కార్పొరేట్ వ్యాపార సమస్యలు తక్కువ ఖర్చుతో తీరుస్తామంటున్న హైదరాబాద్ ఐఏఎంసీపై ప్రత్యేకకథనం.
#Idisangathi
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
welcome to shbcf.ru