Puriti Noppulu Yethara l Amma Pata Full Song l Singer Sai Chand Songs l Mother Song l Mee Folk Tv

preview_player
Показать описание
అందరికి నమస్కారం ఇంతకు ముందు ఉన్న
Telangana Paatalu పేరును మార్పిడి చేసి
Mee Folk Tv పేరుతో
జానపద పల్లె పాటలు మోసుకొని
మీ ముందుకు వస్తున్నాము
మీ జానపదం టీవీ నీ
ఆదరించి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ
మీ ఫోక్ టీవీ

For more Mee Folk Tv Songs Subscribe Us:

#Singer_Sai_Chand
#Writer #Ammapata_Thirupathi
Music Amulya Studio
Dop & Editing: Ajay Kodam
Execution: Dasari Bhaskar
Producer: Gundu Srinivas Goud
Mee Folk Tv CEO : Dindigala Purushotham

L I K E | C O M M E N T | S H A R E | S U B S C R I B E

పురిటి నొప్పుల యేతరా
పూజించే దేవతరాజన్మనిచ్చిన తల్లి
జగతిలోన జాబిల్లి..
నీ పాదాలకు సాష్టంగ వందనం...
ఏమిచ్చినా తీరనిదమ్మా నీ రుణం
అమ్మనీ పాదాలకు సాష్టంగ వందనం ఓ...
ఏమిచ్చినా తీరనిదమ్మా ఆ.. ఆ..నీ రుణం

llపురిటి నొప్పుల యేతరాll

వెచ్చని నీ కడుపుల మోసి
వెలకట్టని ప్రేమను చూపి...
బరువెక్కిన కడుపుతో అమ్మ
ప్రతి అడుగును పదిలంగేసి
ప్రాణ వాయువువందించంగ
పసి గుండె స్పందించగ
మన ఆలన పాలన చూసే
కడుపులోన మనముండంగ
ఎంత జాలి గుండె ఏ...ఏ...ఏ...
అమ్మ ఎంత జాలి గుండె
అందుకే జగతిలా ఉండే
నా కన్నీళ్ళతో నీ కాళ్లు కడిగిన
మోక్షము నాకుండే...

llపురిటి నొప్పుల యేతరాll

బ్రహ్మ కైన అమ్మవు నీవు
అపురూప జన్మవు నీవు
తల్లి త్యాగాల చరితవే
బిడ్డల బంగారు భవితవే
రోతణ నీ గుణమే నిది
ఈ జగతికి నువ్వు పునాది
నీ పేగున ప్రేమలు పండే
బతుకులో ధీవెనలై నిండే
కర్రు నాగలయ్యి యి....ఓ... ఓ...అమ్మ...
కర్రు నాగలయ్యి కత్తులు నీ కడుపు దున్నినా
పాలగమారే నేలన నెత్తుటి దారలే చిందేనా ఆ...ఆ...

llపురిటి నొప్పుల యేతరాll

పుట్టగానే బొడ్డును గోసి
పసిగుడ్డకు ప్రాణం బోసి
చక్కని నీ ప్రేమను చూపి
చనుబాల దారల తాపీ
ముద్దులతో చెంపలు తడిపి
ముద్దు నాన్నా అని పిలిచి
జాగ్రత్తలే పాటించంగా జాగారాలెన్నో చేస్తావు
భాష రాని బాల్యం... ఆ... ఆ...ఆ...
భాష రాని బాల్యం బాధను ఏడ్పులో పసిగడుతౌవ్
దిష్టి తీసి తల కురులతోటి మా కష్టం తొలగిస్తవు....

llపురిటి నొప్పుల యేతరాll

కొత్త బట్టలే కొని తొడిగి
సూర్య చంద్రులంటూ పొగిడి
అందమెట్ల ఉన్నా గాని
అందలాని కెత్తుకుంటది
కండ్ల ముందు కనబడకుంటే
సడుగులెంట అడుగులేస్తది
ఆకలి మన కడుపును చూసి
అమ్మ అల్లాడిపోతది
మచ్చలేని ప్రేమ..ఓ... ఓ...ఓ...
మచ్చలేని ప్రేమ అమ్మామానవతకు చిరునామా
పంచ భూతాలు ప్రాణ దాతవని కొనియాడె ప్రేమా ఆ... ఆ...ఆ...

llపురిటి నొప్పుల యేతరాll
Рекомендации по теме
Комментарии
Автор

అమ్మ పాట ఇంతకంటే గొప్పగా ఇంకా ఎవరు వర్ణించ లేరు అన్న❤ We Miss You Anna 😢

dharmarammanojkumarmanojku
Автор

ఎన్ని జన్మలెత్తినా మీ స్వరము మీ వాయిస్ నీ గొంతులో పాట మళ్లీ చూడలేము సాయి చందు గారు వెరీ వెరీ మిస్ యు 😭😭😭

Chintala.AluveluReddy
Автор

సాయి అన్న నీ పాట విన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది.... నీ పాటలకు మరణం లేదు

saidaiahmanda
Автор

అమ్మ పాట నచ్చని వారు ఈ సృష్టి లో ఎవరూ ఉండరు. అమ్మ ఈ సృష్టి కే మూలం, ప్రతి ఒక్కరూ ఎంతో చక్కగా అమ్మ ను చూచికోవలను. మరిచిపోకండి. ఒక్క సారి వింటే మళ్లీ వినాలని అనిపిసుౖంది మీరు చాలా చక్కగా పాడారు. ధన్యవాదాలు.

gmohanrao
Автор

జోహార్ సాయి చందు అన్న మీ ప్రేమ మాటలలో చెప్పలేనిది మీరు చూపే ప్రేమ అంత ఇంత కాదు అన్న ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడో ఏమో అన్న మిమ్మలను మాకు అందనంత దూరంగా తీసుకెళ్ళాడు ఆ దేవుడు మీ స్వరం ఒక వరం జోహార్ సాయి చందు అన్న 😭😭😭😭✊✊✊✊

mahendrababu
Автор

సాయి అన్న నీ గొంతు నుండి జాలువారే ప్రతిపాట ద్వారా తెలంగాణ తల్లి తరించి ముర్సింది
నువ్వు ఇక లేవని తెలిసి ఆ తల్లి కన్నీరు పెడ్తుంది
ఆ ఇశ్వరుణ్ణి శరణు కోరుతుంది కడుపు కోత పెట్టకు అని
లే అన్న!! రా అన్న!!! మన తెలంగాణ తల్లి ఏడుస్తుంది

ManviBanoth
Автор

ఈ పాట రాసి, పాడి అమ్మ పై ప్రేమను నిరూపించుకున్నారు, అమ్మ పై ఎంత రాసినా తక్కువే.., భాషకు అందని భావన అది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

burracreations
Автор

సూపర్ అన్న మీరు బ్రతికి ఉంటే బాగుండేది 👌👌❤❤

jalandrajeniga
Автор

అమ్మ గొప్పదనం ఎంత చక్కగా వర్ణించారు మీరు ❤

panjaalakeerthi
Автор

అమ్మ గొప్ప తనం గురించి ఇంత గా పాట పాడిన నిన్ను ఆ దేవుడు తీసుకొని పోవడం అన్యాయం. ఆదేవుడు దయ చూపి ఉంటే ఇలాంటి పాటలు emkenno3:59

kalavathitirupati
Автор

అన్న ఎక్కడ ఉన్నావ్ అన్న నీ పాట విన్నప్పుడల్లా ఏడుపు వస్తుంది. నీ పాటలకు మరణం లేదు 😢😢

saidaiahmanda
Автор

చివరి రోజుల్లో అమ్మ బతుకు రొడ్డుపాలవుతుంది, అమ్మ గొప్పతనం చెప్పిన ఈ పాట విని ముసలి తనంలో లో అమ్మకి బువ్వ పెట్టని ఒక్కరు మారినా మీ శ్రమ పలించినట్టే సోదరా.., , 🙏🙏🙏🙏

burracreations
Автор

పాట రాసిన తిరుపతి అన్న నీకు పాదాభి వందనం, సాయి చందు అన్న పాడినండుకు వందనాలు
ఎంత గొప్పగా చెప్పావు అన్న తిరుపతి అన్న
నీ జన్మ ధన్యం అయ్యింది అన్న
నిన్ను కన్న తల్లికి నా మనసారా పాదాభివందనాలు అన్న
కళ్ళు తెరిపించే రచన నీకు ఏవిధంగా చెప్పాలో మాటలు రావడం లేదు గుండె నిండా పొంగి పొరలే అమ్మ గుర్తులు నిందుకున్నయి
కళ్ళనిండా అమ్మకు కృతజ్ఞతల దారాలు కారుతున్నాయి
మరొక్కసారి మీకు, మీ కాలానికి, శిరస్సు వంచి పాదభి వందనా లతో
మీ అభిమాని.
మీ స్ఫూర్తి తో నేను ఒక చిన్న పాట అమ్మ పై రాసి పాడిన.
Lucky folk band
మరువలేనమ్మ అమ్మా నీ ప్రేమా అనే సాంగ్
..
వీలైతే చూసి ఆశీర్వదించి గలరు

ganeshlucky
Автор

🙏🙏🙏🙏🙏🌹🌷💐Sai Chand garu mi pata vinna prathi vyakti అమ్మను సర్వస్వంగా బావించి కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు. ప్రతీ గుండేను కదిలించారు.🙏🙏🌹🌷

mallesrikrishna
Автор

రచన అమ్మపాట తిరుపతికి సాయి చందు కు కంగ్రాట్స్🤝💐💐💐💐💐

kumarneelam
Автор

అన్నయ్య నువ్వునంతా సేఫ్ అమ్మ పాటలు బతికి ఉంటాయి నీ పాటలు వింటూ చూస్తూ బతుకుతున్న మన తెలంగాణ అమ్మలు అక్కలు చెల్లమ్మ లు అన్నలు తమ్ములు కవులు గాయకులూ చూస్తారు.. నీ పాటలో మిట్టపల్లి సురేందర్ అన్నయ్య పాటలో కష్ట సుఖాలు పెద్దల కాడ సేకరించి అర్ధమాయే విధంగా మీరు రాస్తారు అన్నయ్యలు

shekarchedupaka
Автор

🙏🙏 సూపర్ సాంగ్ అన్న నీకు శతకోటి వందనాలు 🙏 అమ్మ గొప్పతనాన్ని చాలా మంచి గా పాటరుపం లో తెలియచేశారు 🙏

akhilpasunuri
Автор

సూపర్ అమ్మ పాట నీ గాత్రం లో పురుడు పోసుకుంది 👍👌🙏

pallekalam-
Автор

సాయి చందు అన్న గారు మీరు పాడిన పాట అమ్మ ప్రేమ ను చుయించింది. సెల్యూట్ అన్న

chinnamsf
Автор

ఐ మిస్ యు అన్నయ్య మీ పాట వింటే కన్నీళ్లు ఆగట్లేదు 😭😭😭😭

ThadraParvatha