Yevaru Choopinchaleni | #JoshuaShaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav |Jesus Songs Telugu

preview_player
Показать описание
Yevaru Choopinchaleni | Joshua Shaik | Pranam Kamlakhar | Aniirvinhya & Avirbhav |Jesus Songs Telugu

Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

Copyright of this music and video belong to Passion For Christ / Joshua Shaik. Any unauthorized reproduction, redistribution Or uploading on YouTube or other streaming engines is Strictly Prohibited.

Be Blessed and stay connected with us!!

#JoshuaShaikSongs #PranamKamlakhar #Aniirvinhya #Avirbhav #JesusSongsTelugu #TeluguChristianSongs
Рекомендации по теме
Комментарии
Автор

Lyrics:
ఎవరు చూపించలేనీ - ఇలలో నను వీడిపోనీ
ఎంతటీ ప్రేమ నీదీ - ఇంతగా కోరుకుందీ
మరువనూ యేసయ్య

నీ కథే నన్నే తాకగా - నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా - నీ దరే నే చేరానుగా

1. తీరాలే దూరమాయే - కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే - కన్నీటి కానుకాయే

నా గుండె లోతులోన - నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక - నీకొరకు వేచివున్నా

ఎడబాటులేని గమనాన
నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ
అపురూపమైన తొలిప్రేమ

ఏకమై తోడుగా - ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా - యేసయ్య నీవెగా

2. ఈ లోక జీవితాన - వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం - వెలిగించె నా ప్రాణం

నీ సన్నిథానమందు - సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే - నడిపించే నా ప్రభూ

నీ తోటి సాగు పయనాన
నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన
నిను వెంబడించు తరుణాన

శాశ్వత ప్రేమతో - సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా నిలిచె నా యేసయ్య

JoshuaShaik
Автор

చూసిన ప్రతి సారి లైక్ కొట్టే ❤ అవకాశం ఉంటే బాగుండేది

bsnayak
Автор

చిన్ని బిడ్డలారా ఆ నిజ దైవమైన యేసు క్రీస్తు ప్రభు ఆశీసులు, దీవెనలు దండిగా, మెండుగా మీమీద కుమ్మరించాలని కోరుకుంటున్నాను. ఆమెన్.

arogyamgoranti
Автор

పిల్లలకు ఇంత చక్కటి గొంతు ఇచినటువంటి దేవాది దేవునికి వందనాలు చెలిస్తవున్నను

KorralakshmiKorralakshmi
Автор

ఎలాంటి వాయిద్యాలు లేకుండా కూడా ఇంత గొప్పగా పాడవచ్చని చూపించారు…❤

BVsukumar
Автор

తెలుగు అక్షరం ముక్క కూడా తెలియని “మలయాళీ పిల్లలు” తెలుగు పాటని ఎంత భావయుక్తంగా, రాగయుక్తంగా పాడారో అద్భుతం!!!👏👏👏💐💐💐

pujarivenkateswarlu
Автор

నేనొక ముస్లింని....ఇన్స్టాలో రీల్ చూసి....వచ్చా.నా మనసును ఒక పాపము నుండి, పశ్చాత్తాపం నుండి ఈ యేసు పలుకులు స్వస్థత చేకూర్చినవని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ఇక పై యేసు నామమెరిగి, శిఖరం వలే జీవించెదను.
Thank you children & God bless you

aanandyogi
Автор

ప్రభువ వీరి ఇద్దరిని నీ మార్గంలో నడిపించు యేసయ్య ఆమెన్

sarithadas
Автор

Iam Hindus but naku యేసయ్య అన్న యెషయ్య పాటలు అన్న చాలా ఇష్టం

pangarupavathi
Автор

వాళ్ల మాతృభాష మలయాళం అయినప్పటికీ తెలుగు లో ఇంత స్పష్టంగా పాడటానికి కారణం వాళ్ల అమ్మగారు. ముందుగా వాళ్ళ అమ్మ గారికి కృతజ్ఞతులు తెలుపుతూ ఈ పాటను ఇంత మధురముగా పాడిన ఇద్దరికి నా అభినందనలు.👏🏻👏🏻

sunnytharun
Автор

బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట నీ వాక్కు సిద్దింప జేసితివి praise the lord

rajeshnatta
Автор

ఈ పాట వింటుంటే సంతోషంతో కన్నీరు ఆగట్లేదు... ఈ పాటతో అద్భుతమైన స్వస్థతలు కూడా జరుగుతాయని నమ్ముచున్నాను.... దేవాది దేవునికే మహిమ. దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక

anoopbablu
Автор

Evaru cūpin̄calēnī - ilalō nanu vīḍipōnī entaṭī prēma nīdī - intagā kōrukundī maruvanū yēsayya nī kathē nannē tākagā - nā madē ninnē cēragā nā gurē nīvai yuṇḍagā - nī darē nē cērānugā 1. Tīrālē dūramāyē - kālālē māripōyē eduraina eṇḍamāvē - kannīṭi kānukāyē nā guṇḍe lōtulōna - nē naligipōtuvunnā ē dāri kānarāka - nīkoraku vēcivunnā eḍabāṭulēni gamanāna ninu cērukunna samayāna nanu ādarin̄cē ghana prēma apurūpamaina toliprēma ēkamai tōḍugā - ūpirē nīvugā evvarū lērugā - yēsayya nīvegā 2. Ī lōka jīvitāna - vēsāripōtuvunnā viluvaina nīdu vākyaṁ - veligin̄ce nā prāṇaṁ nī sannithānamandu - sīyōnu mārgamandu nī divya sēvalōnē - naḍipin̄cē nā prabhū nī tōṭi sāgu payanāna nanu vīḍalēdu kṣaṇamaina nī svaramu cālu udayāna ninu vembaḍin̄cu taruṇāna śāśvata prēmatō - satyavākyambutō nityamu tōḍugā nilice nā

yesuellamparthukolvar
Автор

ఎవరు చూపించలేని – ఇలలో నను వీడిపోని
ఎంతటి ప్రేమ నీది – ఇంతగా కోరుకుంది – మరువను యేసయ్యా (2)
నీ కథే నన్నే తాకగా – నా మదే నిన్నే చేరగా
నా గురే నీవై యుండగా – నీ దరే నే చేరానుగా ||ఎవరు||

తీరాలే దూరమాయే – కాలాలే మారిపోయే
ఎదురైన ఎండమావే – కన్నీటి కానుకాయే
నా గుండె లోతులోన – నే నలిగిపోతువున్నా
ఏ దారి కానరాక – నీ కొరకు వేచివున్నా
ఎడబాటులేని గమనాన – నిను చేరుకున్న సమయాన
నను ఆదరించే ఘన ప్రేమ – అపురూపమైన తొలిప్రేమ
ఏకమై తోడుగా – ఊపిరే నీవుగా
ఎవ్వరూ లేరుగా – యేసయ్యా నీవెగా ||ఎవరు||

ఈ లోక జీవితాన – వేసారిపోతువున్నా
విలువైన నీదు వాక్యం – వెలిగించె నా ప్రాణం
నీ సన్నిధానమందు – సీయోను మార్గమందు
నీ దివ్య సేవలోనే – నడిపించే నా ప్రభూ
నీ తోటి సాగు పయనాన – నను వీడలేదు క్షణమైన
నీ స్వరము చాలు ఉదయాన – నిను వెంబడించు తరుణాన
శాశ్వత ప్రేమతో – సత్యవాక్యంబుతో
నిత్యము తోడుగా – నిలిచె నా యేసయ్యా ||ఎవరు||

aswinijammana
Автор

పసి బిడ్డల మనసు వంటిది పరలోక రాజ్యం. అని చెప్పినట్టు పసి బిడ్డలు పాడుతుంటే శరీరం మనసు తన్మయత్వం మునిగి పోయింది 🙏🌹💞👍👏✝️👌

RaviY-hc
Автор

అలా ఉండాలి సాంగ్ అంటే.
ఊగిపోయేలా కాదు, వినేలా అంటే ఈ సాంగ్ లాగా ఉండాలి.
సైలెంట్ గా
అన్ని మతాలవారు వినేలా, అర్దమైయ్యేలా.

xkwggtz
Автор

ఎవరు చెప్పగలరు పాట బాగులేదని, ఎవరు చెప్పగలరు పిల్లలు సరిగా పాడలేదని, ఇలాంటి వారిని ఎవరు మెచ్చుకోరు? నిజం చెప్పాలంటే మీరు సూపర్.PRAISE THE LORD

medambalaraju
Автор

వీళ్ళ గొంతుకలో అద్భుతమైన స్వరాలను పోసిన దేవదేవునికి మహిమ కలుగును గాక ఈ చిన్నారులు మరెన్నో పాటలు పాడాలి సర్వశక్తుడైన ప్రభువును ఆరాధించాలి ఆమెన్❤

cgsrtpakharikrishna
Автор

మీ ఇద్దరు ఇలా పాడుతుంటే, మీకు ఈ అద్భుతమైన స్వరాన్ని ఇచ్చిన దేవున్ని ఎంత స్తుతించిన తక్కువే.

prabhukumarpresents
Автор

ఈ రోజుల్లో భీకరమైన వాయిద్యాలు పెట్టి
ఆ వాయిద్యాలు మూడ్ లోకి తీసుకొని వెళుతున్నారు
కానీ ఏ వాయిద్యాలు లేకుండా మీరు ఆ పాటలో ఉన్న దేవుని యొక్క ప్రేమను అనేక మందికి చూపిస్తున్నారు
దేవునికి మహిమ కలుగును గాక
God bless u

titusjyothi