Winter Session | Rajya Sabha Adjourned till 2 pm After Opposition Ruckus

preview_player
Показать описание
పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరో మూడు రోజుల్లో ముగియనున్న వేళ....విపక్షాలు తమ డిమాండ్లపై ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. 12 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలు సోమవారం ఎగువ సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశంపై ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ , తృణమూల్ కాంగ్రెస్ సహా విపక్షాలకు చెందిన సభ్యులు.....12 మంది సభ్యులపై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. విపక్ష సభ్యులు 267 నిబంధన కింద ఇచ్చిన నోటీసు ప్రకారం.....సభా కార్యక్రమాలను పక్కన పెట్టి వారు లేవనెత్తిన అంశాలపై చర్చించాలని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. దీన్ని తిరస్కరించిన ఛైర్మన్ వెంకయ్య నాయుడు......సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని పదేపదే విజ్ఞప్తి చేశారు. అయినా విపక్షాలు వెనక్కి తగ్గలేదు. ఈ దశలో ప్రారంభమైన 5 నిమిషాల్లోపే ఛైర్మన్ ......రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме