Jagamantha Kutumbam Naadhi - A Tribute to Sirivennela Seetharama Sastry Garu | Maa Paata Mee Nota

preview_player
Показать описание
Aditya Music presents hand picked hits of the king of Telugu lyrics, Late #SirivennelaSeetharamaSastry garu. He is the master of play of words. Every time we listen to his song it connects to one's heart. Here are some of the super hit #SririvennelaSeetharamaSastry #TeluguHits #jagamanthakutumbam #jagamanthkutumbamsong

Song Name : Jagamanta Kutaumbam
Movie Name : Chakram
Banner : Geetha Chitra International
Producer : C.Venkata Raju
Director : Krishna Vamsi
Music Directer : Chakri
Starring : Prabhas, Aasin
Lyrics : Sirivennela Seetharama Sastry
Singer : Sri

Jagamantha Kutumbam Lyrics in Telugu
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలొ కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం

కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లుల్ని కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల పూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై

నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి
నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి
నా హృదయములో ఇది సినీవాళి

------------------------------------------------------------------------------------------
Enjoy & stay connected with us!

#telugulyricalsongs #telugupopularsongs #telugusongs #telugusuperhitsongs #teluguvideosongs #allteluguhitsongs #trendingsongs #telugu2023latestsongs
Рекомендации по теме
Комментарии
Автор

ఒక మనిషి జీవించిన కొద్ది రోజులు జీవితం ఇలా ఉండాలని చెప్పిన మహా మనిషి నీకు వందనం

spchandrarao
Автор

ఈ పాట మనిషిని వెంటాడుతుంది, వేటాడుతుంది, వేధిస్తుంది, నివేదిస్తుంది, 'వేదా'న్తిస్తుంది, విరహింపచేస్తుంది, విమోచనం చేస్తుంది. సిరివెన్నెల కలంకార్చిన కన్నీరు, శ్రోతల మనసుల్లో పారే పన్నీరు. తెలుగు పాటల ప్రస్థానంలో ఈ పాటది చిరస్థానం.

tip
Автор

ఈ పాట మనస్సు కి కదిలిస్తుంది 😭

మానవ సంబంధాలు
ఎలా ఉన్నాయి అని చెప్తున్నాయి 🙏

ఎంత మంచి పాట

భాదపడటం తప్ప
ఎవరిని ఏమి అనలేం
మనకి మనమే తోడు ☀

hifriends
Автор

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం కన్నా గొప్పగా
హిత్యంఏదీలేదనిపించిది

ramadevibuddharaju
Автор

🙏🏽సిరివెన్నెల సీతారామశాస్త్రి🙏🏽 మీరు కవితా పాటల మేస్త్రీ,
మీరు లేక సిరి కరువైంది,
వెన్నెల మబ్బుల్లో మరుగై యింది, పాటల పల్లకి శాశ్వతంగా మూగబోయింది, కన్నీటితో అభిమానుల గుండె బరువై యింది, వన్నెల, వెన్నెల, వీనుల విందుల పాటలు పంచిన మేధావికి ....నా జోహార్లు🙏🏽 సిరివెన్నెల

మీ విధేయుడు ప్రసన్న 😭

prasannabharghavi
Автор

Super song
అసలు ఈ సాంగ్ నీ ఎలా వర్ణించి కామెంట్ పెట్టాలో తెలియట్లేదు, , , అంత గొప్ప సాంగ్

naidumolliyadav..
Автор

అసభ్యతకు చోటు లేకుండా అద్భుతమైన ప్రణయగీతాలు వ్రాసిన మహాకవి 🙏🙏

yashwanthsooryamekala
Автор

ఒంటరిగా ఉన్నప్పుడు మనసుబాగాలేనపుడు
ఇపాటవింటానుచాలా
ప్రసాంతంగావుంటుందీ
పాదాభివందనంలు
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు
ఓం శాంతి. శాంతి

kumarkoppisetti
Автор

చక్రి గారూ జీవితంలో మరిచిపోని పాటలను తెలుగు ఇండస్ట్రీ చాలా వదిలి అనంతలోకాలకు వెళ్లారు.

BS-dxil
Автор

ఈ పాట జీవితాంతం గుర్తుకు బాధ కలిగినప్పుడు తప్పనిసరిగా పాట రాసిన సిరివెన్నెల గారికి

amarnathjalumuru
Автор

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

సంసార సాగరం నాదె సన్యాసం శూన్యం నావె
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
కవినై కవితనై భార్యనై భర్తనై
కవినై కవితనై భార్యనై భర్తనై

మల్లెల దారిలో మంచు ఎడారిలో
మల్లెల దారిలో మంచు ఎడారిలో

పన్నీటీ జయగీతాల కన్నీటీ జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నేల్ని ఆడ పిల్లల్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై

వింటికి కంటిని నేనై
జంటను మంటను నేనై

మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేను సహగమెస్తూ నాతో నేను పరిభ్రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం

కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

గాలి పలకెలోన తరలి నా పాట పాప ఊరెగె వెడలి
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగవోయి నా గుండె మిగిలి
నా హృదయమె నా లోగిలి
నా హృదయమె నా పాటకి తల్లీ
నా హృదయమె నాకు ఆళి
నా హృదయములో ఇది సినీమావళి

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ
జగమంత కుటుంబం నాది ఏకాకి జీవీతం నాదీ

sravaniboyapati
Автор

Mee Kalam nundi jaluvari ma kallalo nee llu jaluvarthunnay Mee pata amogam

srinivaskonkamalla
Автор

కొందరి రచయిత పాటలు ఆనందాన్ని ఇస్తాయి. మీ పాటలు నాకు ఆలోచించే శక్తీ నీ ఇస్తాయి. .. మీ పాట మా చెవిలో ధ్వనించి ఉన్న అన్ని రోజులు... మీకు మరణం లేదు. శాస్త్రి గారు 🙏🏻

doodlee
Автор

సిరివెన్నెల
జగతికి దేదీప్యము...
గీతమా
మనిషి గమ్యమా...
జనించిన జన్మానికి అర్ధమా
కడకు మరల జన్మకు ప్రయాణామా...
జీవితం
జన్మ ముక్తి కొరకే కదా...
శ్రీ సీతారామయ్య
మీరు దైవంలో విలీనమే కదా...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

suravarapuchalamareddysama
Автор

దేవుడు ఇలాంటి మంచి వ్యక్తి ని ఇవ్వడం ఎందుకు మళ్ళీ తీసుకుపోడం ఎందుకు దేవుడు నాకు కనిపిస్తే గట్టిగా అడుగుతా

anjireddyv.anjereddy
Автор

మేము ఇన్నాళ్లు మీ తో ఉన్నందుకు మేము మమ్ము విడిచి మీరు వెళ్లి పొవడం మేము దురదృష్టలం.... 💐🙏🙏🙏💐

apparao
Автор

అక్షరాలు ఆయుధంగా సానపెట్ట, భావ సారూపాయమైన పదాలు ప్రయోగించిన అరుదైన సాహిత్యం మీ పాటలు చిరకాలం బ్రతికే ఉంటాయి!!we miss u sir 🌹🙏🌹

ssreenivasulu
Автор

అతను ఒక తత్వవేత్త, కవి, గీత రచయిత మరియు మేధావి. మేము అతనిని ఎంతో కోల్పోతాము 🙏🙏

vishual
Автор

మరో జన్మలో మీ పాటల ధారను
కవన సౌందర్యాన్ని వినే అదృష్టం ఉంటే బాగుండేది ....ఓ కవన యోధ..

subbusubbu-zbgs
Автор

శాస్త్రి గారి కలం నుంచి జాలు వారిన ఈ పాట ప్రతిమనిషిలోని మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కదిలిస్తుంది.
జోహార్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
అతి చిన్నవయసులో చక్రిగారిని దగ్గరకు తీసుకొని దేవుడు మనకు అన్యాయం చేశాడు.

martisriramachandramurty