Rahul Gandhi says Witnessing Death of Democracy | Slams BJP

preview_player
Показать описание
ప్రజాస్వామ్యం చనిపోతున్న పరిస్థితులను దేశం చూస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా నియంతృత్వాన్ని ప్రశ్నిస్తే...........వారిపై దారుణంగా దాడి జరుగుతోందని ఆరోపించారు. ఒక రాష్ట్రం, ఒక ప్రాంతమని కాకుండా అన్నిచోట్లా ప్రశ్నించిన వారిని జైళ్లలో పెడుతున్నారని ధ్వజమెత్తారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, జీఎస్టీ రేట్ల పెంపుపై కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ....రాహుల్ దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు. నిత్యావసర ధరలు సామాన్యుడికి అందుబాటులో లేనంతగా పెంచారని, అందుకే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు
#etvandhrapradesh

#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме
Комментарии
Автор

చైనా ఏజెంట్లు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెబుతున్నారు సో ఫన్నీ

narayana
Автор

ఈ ప్రజాస్వామ్య దేశంలో మనకు అభివృద్ధి ఫలాలు దక్కక పోవడానికి, న్యాయం సరైన సమయంలో సరైన రీతిలో జరగకపోవడానికి గల కారణాలు అనేకం ఉన్న అందులో ముఖ్యమైనది

జనాభా పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎలక్షన్ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది?
ఎన్నో ప్రలోభాలకు లోబడి మద్యం ఏరులై పారుతూ ధన ప్రవాహంతో విందులతో వినోదాలతో ఆఖరికి రిగ్గింగ్ తో ప్రజాస్వామ్యం కూనీ చేయబడే విధంగా మన కళ్ళముందే జరుగుతుంటే ఇవన్నీ టీవీలో పేపర్లలో ఎలక్షన్ జరిగిన మర్నాడే మనం చూస్తూ ఏమి చేయగలుగుతున్నాం,
ఇలా గెలుపొందిన ప్రజా ప్రతినిధులు మనకి జవాబుదారీ తనంగా ఎలా ఉండగలరు, మనం ఎవరిని తప్పు పట్టాలి, మనకు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నటు వంటి అత్యున్నత న్యాయస్థానాలు గాని చట్టాలను అమలు పరచవలసిన కార్యనిర్వాహక వర్గాలుగాని ఏమి చేస్తున్నాయి
మన భారతదేశ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఎలక్షన్ ప్రక్రియలో ఉన్న లొసుగులు కారణంగా
రాజకీయ పార్టీలు ఓటర్లను అనేక రకాల తాయిలాలు ఇచ్చి కొనుక్కున్న కారణంగా ప్రజలు ప్రశ్నించే హక్కును
సర్వసాధారణంగా కోల్పోయినారు
మన దేశంలో మెజారిటీ ప్రజలు చాలా మంది మనస్సాక్షి నీ చంపుకొని చూసీచూడనట్లు ఉంటేనే మనుగడ, మన దేశంలోని మేధావి వర్గం మరియు మన భారత దేశ ప్రస్తుత పరిస్థితిపై విసుగెత్తి ఓటింగ్కు మరియు ఎలక్షన్ ప్రక్రియలో పాల్గొనకుండా దూరంగా ఉన్నటువంటివారు మరియు ప్రజానీకం బాధ్యతతొ ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా మనం ఓటు వేసిన నాడే మనకి మంచి సమాజం తద్వారా మంచి దేశంగా మన భారతదేశం నిర్మించబడుతుంది.
జై జన గణ మన,
అనేక అనేక లోపాలు ఉన్నటువంటి మన వ్యవస్థలో మనం ఇప్పటికీ దృఢంగా ఉండటానికి గల కారణం మన భారతీయ కుటుంబ వ్యవస్థ మన పెద్దలు నేర్పిన సభ్యత సంస్కారం ఓర్పు వినయ విధేయతలు ఇవే మనల్ని కాపాడుతున్నాయి అనేది నా గట్టి నమ్మకం మన భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మన తెలుగుజాతి వర్ధిల్లాలని కోరుకుంటూ
కొర్లపాటివెంకట శివరామకృష్ణ

vsrkrishnakorlapati