Russia Believes India, Brazil & African Countries Should Be Represented In UNSC | Sergey Lavrov

preview_player
Показать описание
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి-UNSCలో శాశ్వత సభ్యత్వం పొందే విషయంలో భారత్ కు రష్యా మరోసారి మద్దతుగా నిలిచింది. భారత్ , బ్రెజిల్ తోపాటు ఆఫ్రికా దేశాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ పేర్కొన్నారు. మెజార్టీ వర్గానికి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు. స్థానిక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన... ఈ మేరకు పేర్కొన్నారు. ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని భారత్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. సమకాలీన భౌగోళిక రాజకీయ పరిణామాలను ఐరాసలో ప్రతిబింబించడం లేదని ఉద్ఘాటిస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ లు ఇప్పటికే భారత్ కు మద్దతుగా నిలవగా.. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కూడా ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని అన్నారు. ప్రస్తుతం భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్ , ఫ్రాన్స్ , రష్యా, చైనాలు శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి. UNSCలో భారత్ ప్రాతినిధ్యం కోసం ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతుండగా.. కేవలం చైనా మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------

-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме