Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs - Madhavi, Nassar, Y Vijaya

preview_player
Показать описание
Venuvai Vachanu Song - Nassar Songs - Matru Devo Bhava Movie Songs

Movie: Matru Devo Bhava,
Starring : Madhavi, Nassar, Y. Vijaya, Charuhasan, Subbaraya Sarma, Sarathi, Maharshi Raghava, Tanikella Bharani, Baby Seena,
Director : K. Ajayakumar,
Music : M.M. Keeravani,
Producer : K. S. Rama Rao,
Release date(s): 1993.

Songs
Kannetiki Kaalavalu
Raagam Anuraagam
Raalipoye Puvva
Venuvai Vachanu

Matru Devo Bhava Songs, Matru Devo Bhava Video Songs, Matru Devo Bhava Movie Songs, Matru Devo Bhava Telugu Songs, Matru Devo Bhava Telugu Movie Songs, Matru Devo Bhava Nassar Songs, Matru Devo Bhava Old Songs, Telugu Old Songs, Telugu Hit Songs, Telugu Latest Songs, Matru Devo Bhava Mp3 Songs, Telugu Full Movies, Youtube Movies, Online Telugu Movies, Telugu Evergreen Hits, Nassar Songs, Mobile Movies, Telugu Movies, Drushyam, Aagadu

Watch More Movies @
Рекомендации по теме
Комментарии
Автор

ఏమని స్పందించాలి ఆ దేవుడే దిగి వచ్చి రాసిన ఇంతలా రాయలేడెమో బహుశా ఆ దేవుడే ఆయనల వచ్చి రాసాడేమో.
ఎప్పడిగి తగ్గదు పాట విలువ

మనసులోమాట-ఫణ
Автор

జీవిత పరమ సత్యము ప్రకృతి తో పోలిచి వేటూరి గారు బాగా రచించారు కొన్ని పాటలు రాసిన పాడిన మనుషులు లేక పోయినా మనస్సు లో ఎప్పటికి చెరగని ముద్ర గా గుడి కట్టుకొని వుండు పోతాయి
వేటూరి గారి లాంటి సినీ కవులు
ఎందరో వారి అందరికీ నా నమస్కారం లు

shashanksurisetty
Автор

నాకు బాద భరించలేక పోతున్నపుడు ఈ పాట వింటే చాలు . జీవితం ఇంతే అనిపిస్తుంది

putandoddyimanopadu
Автор

పల్లవి:
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

మాతృ దేవో భవ
పితృ దేవో భవ
అచార్య దేవో భవ

చరణం:1
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండతానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలక లో వెలుగు నే కనక
నేను మేననుకుంటే యద చీకటే హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామ పాదము రాక ఏనాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి

చరణం:2
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారే నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శున్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినైపోయాను గగనానికి
గాలినైపోయాను గగనానికి

చిత్రం:మాతృదేవోభవ
నటీనటులు:మాధవి, నాజర్

Welcome to my “సినిమా గ్యారేజ్” whatsapp group.
నా పేరు బడకల రాజేందర్ రెడ్డి
నా సెల్ నంబర్ 9603008800

rajenderbadakala
Автор

మాధవి గారు... ఇది మీ milestone.. ఈ పాట ఒక అమృతం... అమ్మలందరికీ పాదాభివందనం..

chinnaandhra
Автор

పరిస్థితులు మనసుని బాధ పెడుతున్న, కంట కన్నీరు ఆగడం లేదు జీవితం ఎందుకు అనిపిస్తున్నా, జీవనం సాగించే మనిషి జీవితం చాలా గొప్పది

sureshnaidu
Автор

వేణువై వచ్చాను భువనానికి, గాలి నై పోతాను గగనానికి !

మానవ జన్మ మొత్తాన్ని ( నూరేళ్ళ జీవితాన్ని) ఒక్క లైన్ లో చెప్పిన మహాను భావుడు వేటూరి సుందర రామమూర్తి గారి కి పాదాభివందనం.

ramanababu
Автор

పరిస్థితులు ఎంత కఠినంగా వున్న ఇలాంటి పాటలు వింటే కొంత ఓదార్పు ఉంటుంది.

vandanapupavan
Автор

గొప్ప వాళ్ళ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి దానికి ఉదాహరణ ఈ పాట చాలా గొప్ప ఉన్నత విలువలు కలిగి ఉన్నది ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు వాటి ఫలితాలు ఈ పాటలో స్పష్టంగా వినపడతాయి

hafiyapolymers
Автор

ఈ సినిమా చూసి వాళ్లు ఏడ్చే కుండా ఎవరూ ఉండలేరు😭😭ఏడుపు రానివాళ్లు కూడా ఏడుస్తారు చిత్ర గారు పాడిన పాటలు ఎప్పటికి మరువలేము ఈ సినిమా తీసిన వారికి చాలా థ్యాంక్స్🙏🙏

thesingerzone
Автор

నేటికి మా అమ్మ మమ్మల్ని వదిలి 3 సంవత్సరాలు... ఈ పాట వింటుంటే గుండెల్లో ఎదో తెలియని బాద..అమ్మ అంటే అదేనేమో...

praveenkulkarnis
Автор

జీవితం ప్రాణం ఎంత అశాశ్వతమైనవో ఈపాటలో ఎంత అర్థవంతంగా వివరించారు...hatsoff👌👌

vijayalakshmin
Автор

చిత్ర గారు మన తెలుగు చలన “చిత్ర” పరిశ్రమ కు లభించిన గొప్ప వరం

rajenderbadakala
Автор

ఈ సినిమాని మెదడెమో మళ్ళీ మళ్ళీ చూడమంటోంది, కానీ మనసేమో భయపడుతుంది..

ravikirana
Автор

మనిషి బాధలో ఉన్నప్పుడు ఈ పాట వింటే ఏదో ఫీలింగ్ ఉంటుంది🌹🌺🙏

rajuballepu
Автор

ఈ పాట అబ్దుతం 2024 వినే వారు ఒక like వెయ్యండి మనసు బాగా లేనప్పుడు సాంగ్ వింటే మనసు తెలీకవుతుంది.❤❤❤

nageshh
Автор

నేను గాయనినే బట్ నా బ్రతుకే ఈ పాటలో శూన్యం గా ఇలాగే మిగిలింది ఈ సినిమా & పాటలు యాక్టింగ్ అనుకుంటాము బట్ నా లైఫ్ ఈ సినిమా లో ఈ పాటల ప్రపంచంలో లాగే ఏ క్షణం పాడుతూ పాటమ్మ తోనే ఎప్పుడు తుది శ్వాస ఆగి పోతుందో తెలియకుండానే ఇదే క్షోభ ని నిజ జీవితం లో అనుభవిస్తూ నా బిడ్డ లా కోసం ఆలా ఆ భగవంతుడి మీద భారమేస్తూ బ్రతిస్తున్న పాడుతూనే చివరి శ్వాస ఆగేవరకు ఇలాగే నిజ జీవితం లో

renufolkmusic
Автор

వేటూరి గారి పాద పద్మాలకి శిరసు వంచి నమస్కరించాలి. ఎక్కడినుంచి వస్తాయి స్వామి ఇంతటి హృద్యమైన సంగీత ధార. నిజం గా మనిషి ఇంతటి హృద్యంగా భగవంతుని వెడుకొగలిగితే ఆయన కరిగి ముద్ధై పోరా ఈ ఆర్తికి. నిజంగా మనసు భారమై గొంతు పట్టేస్తుంది ఈ పాట వింటుంటే హ్యాట్సాఫ్ తెలుగు సంగీత ఝరి వేటూరి గారిలంటి ఎందోరో సంగీత సామ్రాట్ లనీ అందించిన మన తెలుగు తల్లులకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

jayalakshmivelpula
Автор

ఈ సినిమా చూసి కన్నీళ్లు పెట్టని మనిషి లేరంటే అతియోశక్తి కాదేమో...

BallaRamu-zt
Автор

ఈ పాట మాధురి మాధ మాతృదేవోభవ చిత్రంలోని ఈ పాట అద్భుతం మహా అద్భుతం ఈ పాట వింటుంటే హృదయాలు కదిలిస్తూ ఉంటే అన్నమాట ఇలాంటి పాటలు రావట్లేదని ఒకే ఒక్క బాధ ఈ పాట వచ్చినందుకు ఒకే ఒక్క సంతోషం అదే జివిఆర్

GurmurthyGundu