Heavy Snow in Japan Leaves 17 Dead, Dozens injured

preview_player
Показать описание
జపాన్ లో వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న మంచు... 17మందిని బలి తీసుకుంది. మరో 93మంది తీవ్రంగా గాయపడ్డారు. శీతాకాలంలో సాధారణంగా కురిసే మంచుకన్నా మూడు రెట్లు అధికంగా హిమపాతం జపాన్ ను అతలాకుతలం చేస్తోంది. జపాన్ ఉత్తరతీర ప్రాంతంలో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. అనేక నగరాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. అక్కడి ఓ ప్రధాన ద్వీపంలో విద్యుత్ కేంద్రం ధ్వంసమవడంతో 20వేల ఇళ్లలో అంధకారం అలుముకుంది. విద్యుత్ లేక ఇళ్లలోని హీటర్ లు పనిచేయక ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. రహదారులు, వంతెనలపై మంచు.. అడుగుల మేర పేరుకుపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. వేలాది వాహనాలు, ఇళ్లను... మంచు కప్పేసింది. డజన్ల కొద్ది రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అడుగుతీసి బయటపెట్టలేని పరిస్థితులు ఏర్పడటంతో ప్రజలు క్రిస్మస్ వేడుకలకు దూరమయ్యారు
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
-----------------------------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме